పాలు ఆరోగ్యానికి మంచివే - ఈ సమస్యలున్న వారు తాగారో, ఇక అంతే..!!

పాలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. పాల‌లో మ‌న శ‌రీరానికి కావ‌ల్సిన దాదాపు అన్ని పోష‌కాలు ఉంటాయి. అందుక‌నే పాల‌ను సంపూర్ణ పౌష్టికాహారంగా పిలుస్తారు. పాల‌లో ఉండే అనేక ర‌కాల విట‌మిన్లు, మిన‌ర‌ల్స్ మ‌న‌ల్ని అన్ని విధాలుగా ఆరోగ్యంగా ఉంచుతాయి. పాల‌లో క్యాల్షియం, విట‌మిన్ డి అధికంగా ఉంటాయి. ఆరోగ్యంగా పాలు ఎంత మేలు చేసినా.. కొన్ని సమస్యలు ఉన్న వారు మాత్రం పాల పదార్ధాలకు దూరంగా ఉండాలని నిపుణులు సూచిస్తున్నారు. లేకుంటే వారికి ప్రయోజనం కంటే నష్టం కలిగే అవకాశాలు ఉంటాయి.

పాల‌ను రోజూ తాగాల‌ని పోష‌కాహార నిపుణులు, వైద్యులు చెబుతుంటారు. పాల‌ను తాగ‌డం వ‌ల్ల దంతాలు ఆరోగ్యంగా ఉంటాయి. వృద్ధాప్యంలో వ‌చ్చే ఆస్టియోపోరోసిస్ వంటి ఎముక‌ల సంబంధ వ్యాధులు రాకుండా అడ్డుకోవ‌చ్చు. వృద్ధాప్యంలోనూ ఎముకలు బ‌లంగా ఉంటాయి. పాల‌ను తాగడం వ‌ల్ల ప్రోటీన్లు అధికంగా ల‌భిస్తాయి. పాల‌లో ఉండే వే, కేసీన్ అనే ప్రోటీన్లు అథ్లెట్లు, శారీర‌క శ్ర‌మ చేసేవారు, వ్యాయామం చేసేవారికి ఎంతో మేలు చేస్తాయి. పాలలో విట‌మిన్ బి12 అధికంగా ఉంటుంది. ఇది ఎర్ర ర‌క్త క‌ణాలు నిర్మాణం అయ్యేలా చేస్తుంది. ఇందులో ఉండే పొటాషియం బీపీని నియంత్రిస్తుంది. పాల‌లో ఉండే ఫాస్ఫ‌ర‌స్ శ‌రీరానికి శ‌క్తి ల‌భించేలా చేస్తుంది. పాల‌లో ట్రిప్టోఫాన్ అనే స‌మ్మేళ‌నం ఉంటుంది. ఇది నిద్ర‌ను ప్రేరేపిస్తుంది. క‌నుక పాల‌ను రాత్రి పూట తాగితే మంచిది. లేదంటే ఉద‌యం లేదా మ‌ధ్యాహ్నం వేళ్ల‌లో తాగితే ఆ స‌మ‌యంలో నిద్ర వ‌చ్చి మీ ప‌నుల‌కు ఆటంకం క‌లిగే అవ‌కాశాలు ఉంటాయి.

which-people-do-not-drink-milk-here-the-specialist-advices

అయితే, ఆయుర్వేద చెబుతున్న ప్ర‌కారం కూడా పాల‌ను రాత్రి పూట తాగితేనే మంచిది. దీంతో ఒత్తిడి, ఆందోళ‌న త‌గ్గుతాయి. మానసిక ప్ర‌శాంత‌త ల‌భిస్తుంది. నిద్ర చ‌క్క‌గా ప‌డుతుంది. కానీ కొంద‌రికి పాలు తాగితే ప‌డ‌వు. అల‌ర్జీ ఉంటుంది. అందుకు కార‌ణం పాలలో ఉండే లాక్టోజ్ అనే ఓ స‌మ్మేళ‌న‌మే. ఇది చ‌క్కెర జాతికి చెందుతుంది. లాక్టోజ్‌ను జీర్ణం చేయాలంటే శ‌రీరంలో లాక్టేజ్ అనే ఎంజైమ్ ఉండాలి. కానీ కొంద‌రికి శ‌రీరంలో లాక్జేజ్ చాలా త‌క్కువ‌గా ఉంటుంది. అలాంటి వారు పాల‌ను తాగితే లాక్టోజ్ జీర్ణం కాదు. ఇలాంటి స‌మ‌స్య ఉన్న‌వారు పాల‌ను తాగితే క‌డుపు ఉబ్బ‌రం, గ్యాస్‌, క‌డుపు నొప్పి, విరేచ‌నాలు వంటి స‌మ‌స్య‌లు వ‌చ్చే అవ‌కాశాలు ఉంటాయి. పాల ‌లో ఉండే వే, కేసీఆన్ అనే ప్రోటీన్లు కూడా కొంద‌రికి ప‌డ‌వు. అలాంటి వారు కూడా పాల‌ను తాగ‌కూడ‌దు. అధ్య‌య‌నాలు చెబుతున్న ప్ర‌కారం మొటిమ‌లు అధికంగా ఉండేవారు, ఐబీఎస్ అనే వ్యాధి ఉన్న‌వారు పాల‌కు దూరంగా ఉంటేనే మంచిదని నిపుణులు సూచిస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+