రోజూ చపాతీలు తింటున్నారా, మంచిదేనా - నిపుణుల సూచనలు..!!
ప్రస్తుత కాలంలో జీవన శైలి.. ఆహారపు అలవాట్లలో మార్పు కనిపిస్తోంది. ఎక్కువ మంది రాత్రి వేళ చపాతి తీసుకునేందుకు ప్రాధాన్యత ఇస్తున్నారు. అధిక బరువుతో నియంత్రణతో పాటుగా అనేక ఆరోగ్య సమస్యలకు చపాతీ ఆహారం మేలు చేస్తుంది. ఇదే సమయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవా ల్సిన అవసరం ఉందని నిపుణులు సూచిస్తున్నారు. చపాతీలతో పాటుగా తీసుకునే కూరల విషయంలోనూ పలు సూచనలు చేసారు.
చపాతీలు సాధారణంగా గోధుమపిండితో తయారు చేస్తారు. ఇందులో ఉండే ఫైబర్ ఆరోగ్యానికి మంచిదేనని నిపుణులు చెబుతున్నారు. ఇది జీర్ణక్రియకు సహాయపడుతుందని, మలబద్ధకాన్ని నివారిస్తుందని, పేగుల ఆరోగ్యాన్ని కాపాడుతుంది. ఇందులో బి1, బి2, బి3, బి6, బి9, ఇ విటమిన్లతో పాటు ఐరన్, కాపర్, మాంగనీస్, సిలికాన్, మెగ్నీషియం, ఫాస్ఫరస్, పొటాషియం, అయోడిన్, జింక్, కాల్షియం వంటి ఖనిజాలు పుష్కలంగా లభిస్తాయని పేర్కొంటున్నారు. దీంతో రోజంతా ఉత్సాహంగా ఉండొచ్చని పేర్కొంటున్నారు. చపాతీలు రక్తంలో చక్కెర స్థాయిలను నెమ్మదిగా పెంచుతాయని, డయాబెటిస్తో బాధపడుతున్న వారికి లేదా రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించా లనుకునే వారికి మంచిది. చపాతీల్లో ఉండే బి విటమిన్లు, జింక్, ఇతర ఖనిజాలు చర్మ ఆరోగ్యాన్ని పెంపొందించడంలో సహకరిస్తాయి. చపాతీలు గుండె ఆరోగ్యానికి మంచిదని నిపుణులు చెబుతున్నారు.

చపాతీ ఆరోగ్యానికి మంచిదే కదా అని ఎక్కువ నూనె, నెయ్యితో చేసుకోవడం వల్ల బాడీలో అనవ సర కొవ్వులు చేరతాయని నిపుణులు చెబుతున్నారు. పుల్కా చేసుకొని తింటే మరీ మంచిదని పేర్కొంటున్నారు. మార్కెట్లో దొరికే పిండిలో మైదా కూడా కలిసి ఉంటుందని, కాబట్టి ముడి గోధుమ లు తీసుకొని స్వయంగా పట్టించుకొని ఆ పిండితో చపాతీ చేసుకుంటే మంచిది. చపాతీ లో కాంబినే షన్ కోసం పప్పు.. బంగాళాదుంప కర్రీ అని కాకుండా అన్ని రకాల కాయగూరలతో చేసిన కూరలు తీసుకోవడం వల్ల పోషకాలన్నీ శరీరానికి అందుతాయని సూచిస్తున్నారు. ఈ క్రమంలో క్యారెట్ ముక్కలు, బీన్స్, పాలకూర వంటి వాటిని ఉడికించి, గోధుమ పిండి కలుపుకొని చపాతీలు చేసు కుంటే అటు రుచికి, ఇటు ఆరోగ్యానికి ఆరోగ్యం. గోధుమపిండికి రాగి పిండి, సోయాబీన్ పిండి, చిరుధాన్యాలతో తయారుచేసిన పిండి వంటివి కూడా కలుపుకొని చపాతీ తయారు చేసుకోవచ్చు.
-
West Bengal Survey: బీజేపీ అంతర్గత సర్వేలో షాకింగ్- ఎన్ని సీట్లో తెలుసా ? -
మూడు పండుగలకు రెగ్యులర్ గా మూడు ఉచిత సిలిండర్ల పంపిణీ + రూ.2,000 -
Tamil Nadu Polls: సర్వేల షాక్ తో విజయ్ బిగ్ టర్న్..! తుది దశలో తాజా ప్లాన్..! -
ఎన్నికల వేళ విజయ్ సమర్థతను తేల్చేసిన పవన్..!! -
ఇలా చేస్తే అమరావతి గొడవ క్లోజ్..! మావిగన్ వేళ చంద్రబాబుకు సాయిరెడ్డి ఐడియా..! -
Amaravati: సాయిరెడ్డి సలహాపై స్పందించిన టీడీపీ..! బహిరంగ లేఖ..! -
ఆర్టీసీ బస్సు ఛార్జీల్లో మార్పులు, కొత్త రేట్లు ఇలా..!! -
అలిపిరి నుంచిప్రత్యేకంగా 11 లేన్ల రహదారి- టోల్ గేట్ సమూల పునరుద్ధరణ? -
పసిడికి భారీ డిమాండ్: కుప్పలు తెప్పలుగా -
రైతులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్, పథకాలు ఇక నుంచి..!! -
సమ్మర్ లో ఈ హిల్ స్టేషన్ కు వెళ్తే.. మళ్లీ తిరిగి రావాలనిపించదు..! -
US Blockade: అమెరికాకు బిగ్ షాక్..! తేలిపోయిన హార్ముజ్ దిగ్బంధం..!












Click it and Unblock the Notifications