Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

దోమలు కొందరినే ఎందుకు కుడతాయి? కారణాలివే?

దోమలు రెండు రకాలుగా ఉంటాయి. ఆడ దోమలు, మగ దోమలు. మగ దోమలు మనుషులను కుట్టవు. వాటికి మనుషుల రక్తంతో పనిలేదు. అవి చెట్ల కాండంలోని ద్రవాలతో సరిపెట్టుకుంటాయి. అయినా వాటి అవయవ నిర్మాణం కూడా మనుషులను కుట్టటానికి అనుకూలంగా ఉండదు. ఆడదొమలు మాత్రం మనుషులను కుడతాయి.

దోమలు మనుషులను ఎక్కువగా ఎందుకు కుడతాయి అంటే
దోమలు ముఖ్యంగా తమ గుడ్లను ఉత్పత్తి చేయడానికి మనుషుల రక్తంలో ఉన్న కొన్ని ప్రోటీన్ లను ఉపయోగించుకుంటాయి. అందుకే ఆడ దోమలు మనుషులను కుడతాయి. అయితే చాలామంది తమను దోమలు ఎక్కువగా కుడతాయని తెగ బాధపడుతూ ఉంటారు. అసలు దోమలు కొంతమందిని ఎందుకు ఎక్కువగా కుడతాయి అంటే.

Why do mosquitoes bite only some people What are the reasons

ఈ కారణాలతో వీరినే దోమలు ఎక్కువ కుడతాయి
దోమలు మనుషుల వద్ద కార్బన్ డై ఆక్సైడ్ ను గుర్తిస్తాయి. ఎవరైతే ఎక్కువ కార్బన్ డై ఆక్సైడ్ ను వదులుతారో వారిని దోమలు కుడతాయి. ముఖ్యంగా గర్భిణీ స్త్రీలు అధిక జీవక్రియ రేటు కలిగిన వ్యక్తులను ఎక్కువగా దోమలు కుడతాయి. అంతేకాదు దోమలు శరీర వెచ్చదనానికి ఆకర్షితులవుతాయి. శరీర ఉష్ణోగ్రత కొంచెం ఎక్కువగా ఉన్న వ్యక్తులు దోమల వల్ల ఆకర్షించబడతారు. కాబట్టి వారిని కూడా దోమలు ఎక్కువగా కుడతాయి.

వీరిని దోమలు ఎక్కువగా కుట్టటం వెనుక రీజన్స్
ఇక కొన్ని పరిశోధనలు దోమలు కొన్ని బ్లడ్ గ్రూప్స్ ఉన్న వారిని ఎక్కువగా కుడతాయని వెల్లడించాయి. ఓ పాజిటివ్ ఉన్న వారిని ఇతరుల కంటే ఎక్కువగా దోమలు ఇష్టపడి కుడతాయి. అంతేకాదు బలమైన సువాసనలు దోమలను ఆకర్షిస్తాయి. ఎక్కువగా ఘాటైన పర్ఫ్యూమ్ లు, డియోడ్రెంట్ లు ఉపయోగించే వారిని దోమలు కుడతాయి. ఎలాంటి ఘాటైన వాసన వచ్చినా దోమలు వారిని కుడతాయి.

దోమలకు వీరంటే అందుకే ఇష్టం
ముదురు రంగు బట్టలు వేసుకున్న వారిని, ఎక్కువగా చెమట పట్టి చెమట వాసన వచ్చే వారిని దోమలు ఎక్కువగా కుడతాయి. ఇక బీర్ ఎక్కువగా తాగే వారిని కూడా దోమలు కుడతాయి. కొంతమంది వ్యక్తులు జన్యు రీత్యా కూడా దోమలకు బాగా ఇష్టమైన వారిగా ఉంటారు. అలాంటి వారు కూడా దోమకాటుకు గురవుతారు. అంతేకాదు నీటి వనరుల సమీపంలో, తేమతో కూడిన వాతావరణం లో ఉన్న వారిని కూడా దోమలు ఎక్కువగా కుడతాయి.

disclaimer: ఈ కథనం వైద్య నిపుణుల సలహాలు, ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా రూపొందించబడినది. దీనిని oneindia ధ్రువీకరించలేదు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+