Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

Health tips: చలికాలం.. రోగాల కాలం: హెల్త్ జాగ్రత్త.. ఈ టిప్స్ పాటించండి!!

చలికాలం రానే వచ్చింది. చలికాలం తనతో పాటు అనేక రోగాలను కూడా వెంట తీసుకొస్తుంది. చలికాలం వచ్చిందంటే చాలు జలుబు, దగ్గు, సీజనల్ జ్వరాలు మనల్ని ఇబ్బందులు పెడుతుంటాయి. చలికాలంలో మారుతున్న వాతావరణం ఒక్కసారిగా మన ఆరోగ్యం పైన తీవ్రమైన ప్రభావం చూపిస్తుంది. అయితే చలికాలంలో మనం చిన్న చిన్న జాగ్రత్తలు తీసుకోవడం వల్ల వ్యాధుల బారిన పడకుండా కాపాడుకునే అవకాశం ఉంటుంది.

శీతాకాలంలో ఎటువంటి చిట్కాలను మనం తీసుకోవాలో ప్రస్తుతం తెలుసుకుందాం. శీతాకాలంలో రోగనిరోధక శక్తి పెంపొందించుకోవడానికి ఆహారం విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి. ముఖ్యంగా పౌష్టికాహారాన్ని మనం ఈ శీతాకాలంలో తీసుకోవాల్సిన అవసరం ఉంది. తృణధాన్యాలు, మాంసం, చిక్కుడు గింజలు, చేపలు, తాజా కూరగాయలు తాజా పండ్లతో పాటు విటమిన్-డి ఎక్కువగా ఉండే ఆహారాన్ని తీసుకోవాలి.

Winter.. Season of diseases: Take care of health.. Follow these tips!!

పౌష్టికాహారం తీసుకుంటే మన వ్యాధినిరోధక శక్తి పెరుగుతుంది. మన శరీరం ఆరోగ్యంగా ఉంటుంది. శీతాకాలంలో వచ్చే చిన్న చిన్న అనారోగ్య సమస్యలను దీటుగా ఎదుర్కొంటుంది. శీతాకాలంలో చాలామంది విపరీతమైన ఒళ్లు నొప్పులతో బాధపడుతూ ఉంటారు. అయితే ఈ నొప్పుల నుంచి ఉపశమనం పొందాలంటే వ్యాయామం చేయడం ఎంతో ఉత్తమమని చెప్తున్నారు.

కచ్చితంగా రోజువారీ దినచర్యగా వ్యాయామం చేయాలని సూచిస్తున్నారు. విటమిన్ డి అవసరం శీతాకాలంలో ఎక్కువ ఉంటుంది కాబట్టి, విటమిన్ డిని ఇచ్చే సూర్యరశ్మిని ఆస్వాదించే ప్రయత్నం కూడా చేయాలి. శీతాకాలంలో ఎక్కువ నీటిని తాగాలి. శరీరాన్ని హైడ్రేటెడ్ గా ఉంచాలి. శరీరం డీహైడ్రేట్ కాకుండా కాపాడుకోవాలి. శీతాకాలంలో ఎక్కువ నీళ్లు తాగడం వల్ల శరీరంలో ఉండే టాక్సిన్స్ తొలగిపోతాయి.

ఇక శీతాకాలంలో పరిశుభ్రత పాటించాలని, బ్యాక్టీరియా, వైరస్ వంటివి వ్యాప్తి చెందకుండా శుభ్రంగా ఉంటూ తగిన జాగ్రత్తలు తీసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు. శీతాకాలంలో చర్మ సంబంధమైన ఇబ్బందులు కలుగుతాయి. చర్మం పొడిబారటం, పగుళ్ళు రావటం, దురదలు రావటం వంటి ఇబ్బందులు కలుగుతాయి. కనుక శీతాకాలంలో చర్మాన్ని కాపాడుకోవటానికి మాయిశ్చరైజర్స్ ఉపయోగించాలి. శీతాకాలంలో అనారోగ్యం రాకుండా ఉండాలంటే మంచి నిద్ర కూడా పోవాలి.

disclaimer: ఈ కథనం వైద్య నిపుణుల సూచనలు మరియు ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న అంశాల ఆధారంగా రూపొందించబడింది. oneindia దీనిని ధృవీకరించలేదు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+