సూపర్ టేస్టీ 'మటన్ పాయా'.. ఇంట్లోనే ఈజీగా ఎలా తయారు చేయాలి..?
సండే వచ్చిందంటే చాలు ఇంట్లో చికెన్ లేదా మటన్ ఉండాల్సిందే. చలికాలంలో హాట్ హాట్ గా, స్పైసీగా మటన్ పాయా చేసుకోవాలని ఉందా..? ఈ కాలంలో మటన్ పాయా మంచి రోగనిరోధక శక్తి బూస్టర్ గా కూడా పనిచేస్తుందని నిపుణులు చెబుతున్నారు. పిల్లల నుంచి పెద్దల వరకు ఇష్టంగా తినే ఈ మటన్ పాయా గురించి ఎంత చెప్పినా తక్కువే.. మరి నోరూరించే మటన్ పాయా ఎలా తయారు చేసుకోవాలి..? ఏమేం పదార్థాలు కావాలి..? ఇక్కడ తెలుసుకుందాం..
మటన్ పాయాకు కావాల్సిన పదార్థాలు ఓ సారి చూస్తే.. మేక కాళ్లు 5-6 తీసుకోవాలి, ఉల్లిపాయ ముక్కలు, వెల్లుల్లి, లవంగాలు, అల్లం, నీళ్లు(హాఫ్ లీటర్), నూనె తగినంత, యాలకులు, బిరియానీ ఆకులు , దాల్చిన చెక్క, మిరియాల పొడి , కొత్తిమీర , ఉప్పు తగినంత తీసుకోవాలి.

ఇక తయారు చేసే విధానం ఓ సారి చూస్తే.. ముందుగా స్టవ్ ఆన్ చేసి కుక్కర్ పెట్టి అందులో తగినంత నూనె పోసుకోవాలి. నూనె వేడెక్కిన తర్వాత మసాలా దినుసులు అందులో వేయాలి. బాగా వేయించాలి. అవి వేగిన తర్వాత అప్పటికే తరిగిన అల్లం, వెల్లుల్లి, ఉల్లిపాయలు వేసుకోవాలి. ఆ తర్వాత అందులో కడిగి పెట్టుకున్న మేక కాళ్లను వేయాలి. తక్కువ మంటలో వాటిని వేయించుకోవాలి. ఆ తర్వాత అందులో ఉప్పు, మిరియాలు వేసి ఆ తర్వాత నీళ్లు పోసి బాగా కలుపుకోవాలి. ఆ తర్వాత కుక్కర్ మూత పెట్టి 7-8 విజిల్స్ వచ్చేంత వరకూ ఉడికించాలి. ఆ తర్వాత స్టవ్ ఆఫ్ చేసి సూప్ ను వడకట్టాలి. దాంతో మటన్ పాయా సూప్ రెడీ అయినట్లే..












Click it and Unblock the Notifications