ఆంధ్రా స్టైల్ క్యాలీఫ్లవర్ పచ్చడితో ఆన్నం కడుపు నిండా తింటారు.. ఆరోగ్యంగా ఉంటారు!
మనం తీసుకునే ఆహారం మన ఆరోగ్యంపైన ప్రభావాన్ని చూపిస్తుంది. మనం తీసుకునే ఆహారమే మన ఆరోగ్యాన్ని నిర్ణయిస్తుంది. అందుకే తినే ఆహారం విషయంలో జాగ్రత్త వహించాలి. మంచి రుచికరమైన ఆహారం మాత్రమే కాదు మనకు ఆరోగ్య ప్రయోజనాలను చేకూర్చే ఆహారాన్ని తినాలి. అటువంటి ఆహారాలలో క్యాలీఫ్లవర్ ఒకటి. ప్రస్తుతం మనం ఆంధ్ర స్టైల్ క్యాలీఫ్లవర్ పచ్చడి ని ఏవిధంగా తయారు చేయాలి? దీంతో కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి? తెలుసుకుందాం.
కావలసిన పదార్థాలు
క్యాలీఫ్లవర్- ఒకటి మీడియం సైజ్
ఉప్పు- తగినంత
పసుపు- హాఫ్ టీ స్పూన్
కారప్పొడి- రెండు టీ స్పూన్లు రుచికి తగినంత
ఆవాలు- రెండు టీ స్పూన్లు
మెంతులు- హాఫ్ టీ స్పూన్
వెల్లుల్లి రెబ్బలు-10
ఇంగువ- చిటికెడు
నూనె- నాలుగు టేబుల్ స్పూన్లు
నిమ్మరసం- క్యాలీఫ్లవర్ పచ్చడి ని బట్టి
కరివేపాకు- రెండు రెమ్మలు
ఎండుమిర్చి- 2

తయారీ విధానం
క్యాలీఫ్లవర్ ను చిన్న ముక్కలుగా కట్ చేసి ఉప్పు కలిపిన వేడినీళ్లలో ఐదు నిమిషాలు వేసి వడకట్టాలి. ఆ తర్వాత క్యాలీఫ్లవర్ ను పూర్తిగా తడిలేకుండా ఆరనివ్వాలి. ఒకటిన్నర స్పూన్ ఆవాలు, హాఫ్ స్పూన్ మెంతులు తేలికగా వేయించి మెత్తగా పొడి చేసుకోవాలి. ఆ తర్వాత ఒక గిన్నె తీసుకుని గిన్నెలో క్యాలీఫ్లవర్ ముక్కలు, ఉప్పు, పసుపు, కారప్పొడి, ఆవాలు, మెంతులపొడి, కచ్చాపచ్చాగా దంచిన వెల్లుల్లి వేసి బాగా కలపాలి.
ఇలా చేస్తే బాగా నిల్వ ఉంటుంది
అందులో ఒక పాన్ లో నూనె వేడిచేసి ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, కరివేపాకు, ఇంగువ వేసి తాలింపు వేసి ఆ తాలింపును పచ్చడిలో కలపాలి.కొంచెం వేడి చల్లారిన తర్వాత అందులో నిమ్మరసం కలుపుకోవాలి. గంటసేపు ఇది ఊరితే పచ్చడి చాలా రుచిగా ఉంటుంది. అయితే పచ్చడి ఎక్కువ రోజులు నిలువ ఉండాలంటే క్యాలీఫ్లవర్ పూర్తిగా పొడిగా ఆరేలా చూసుకోవాలి. ఫ్రిజ్లో పెట్టుకుంటే ఈ పచ్చడి పది రోజుల పాటు నిల్వ ఉంటుంది.
క్యాలీఫ్లవర్ పచ్చడితో ఆరోగ్య ప్రయోజనాలు
ఇక కాలీఫ్లవర్ తో అనేక ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి. క్యాలీఫ్లవర్ పచ్చడి తింటే రోగ నిరోధక శక్తి పెరుగుతుంది జీర్ణక్రియ మెరుగవుతుంది బరువు నియంత్రణకు దోహదం చేస్తుంది గుండె ఆరోగ్యానికి మేలు కలుగుతుంది ఎముకలకు బలం పెరుగుతుంది. క్యాన్సర్ ప్రమాదాన్ని తగ్గించడానికి సహాయం చేస్తుంది. మధుమేహం ఉన్నవారికి క్యాలీఫ్లవర్ పచ్చడి చాలా మంచిది.












Click it and Unblock the Notifications