పరగడుపున వేపాకు తింటే మీ శరీరంలో జరిగే అద్భుతాలు అన్నీ ఇన్నీ కావు!
వేపాకు.. ఆయుర్వేదంలో వేపాకుకు ఉండే పాత్ర అంతా ఇంతా కాదు. వేపాకు తింటే చాలా ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి. ప్రతిరోజు వేపాకును నమలటం అలవాటు చేసుకుంటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు అన్ని ఇన్ని కావు. మరి వేపాకుతో మనకు కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటో ప్రస్తుతం మనం తెలుసుకుందాం.
వేపాకును తింటే బోలెడు ఆరోగ్య ప్రయోజనాలు
వేపాకును ప్రతిరోజు పరగడుపున తినడం వల్ల జీర్ణశక్తి మెరుగుపడుతుంది. వేపాకు మన శరీరంలో వ్యాధి నిరోధక శక్తిని పెంచుతుంది. రక్తంలో చక్కెర స్థాయిలను కంట్రోల్ చేస్తుంది. డయాబెటిస్ బాధితులు ప్రతిరోజు ఉదయం వేపాకును తినడం ఎంతో మంచిది. వేపాకులో ఉండే గుణాలు జీర్ణవ్యవస్థను శుభ్రం చేసి, మనకు జీర్ణ సంబంధిత వ్యాధులు రాకుండా చూస్తాయి. వేపాకులో ఉండే పోషకాలు మన వ్యాధి నిరోధక శక్తిని పెంచి అనారోగ్యాల నుండి కాపాడతాయి.

లివర్ కు, రక్త శుద్ధికి వేపాకు బెస్ట్
ప్రతిరోజు ఉదయం వేపాకు తినడం కాలేయానికి మేలు చేస్తుంది. కాలేయ సంబంధిత సమస్యలు వేపాకు తింటే మాయమవుతాయి. వేపాకు మన శరీరంలోని రక్తాన్ని శుద్ధి చేస్తుంది. మన చర్మాన్ని కాపాడుతుంది. ఇతర అవయవాలకు కూడా మేలు చేస్తుంది. వేపాకును ప్రతిరోజు తీసుకుంటే వేపాకులో ఉండే యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ ఫంగల్ గుణాల వల్ల చర్మం పైన వచ్చే మొటిమలు, మచ్చలు, ఇతర ఇన్ఫెక్షన్లు మాయమవుతాయి.
వేపాకుతో ఒత్తిడికి చెక్
ఇక ప్రతిరోజు పరగడుపున వేపాకును తినడం వల్ల ఒత్తిడి తగ్గుతుంది. మానసిక ఆందోళనలు నయం చేయడంలో వేపాకు కీలకంగా పనిచేస్తుంది. ఇక వేపాకులో ఉండే ఫైబర్ కారణంగా మలబద్ధకం వంటి సమస్యలు పోతాయి. అయితే ప్రతిరోజు ఉదయాన్నే పరగడుపున మూడు నుంచి నాలుగు వేపాకులను నమిలి తినాలి. వేపాకులను తినలేకుంటే వేపాకు రసం కూడా తీసుకోవచ్చు .
వేపాకును అలా తీసుకోవటం మంచిది కాదు
వేపాకు పొడిని కూడా నీటిలో కలుపుకుని తాగవచ్చు. అయితే ఎక్కువగా తీసుకోవడం మాత్రం మంచిది కాదు. వేపాకును తీసుకునే వారికి ఎటువంటి దుష్ప్రభావాలు కనిపించినా, వెంటనే దానిని వాడడం మానేయాలి. దీర్ఘకాలిక వ్యాధులకు, సీజనల్ వ్యాధులకు, రకరకాల ఇన్ఫెక్షన్లకు దివ్య ఔషధంలా పనిచేసే వేపాకులో ఉన్న గుణాలను దృష్టిలో పెట్టుకుని ప్రతిరోజు ఒక క్రమ పద్ధతిలో దాని వినియోగం చేస్తే అది ఖచ్చితంగా సత్ఫలితాలను ఇస్తుంది.
disclaimer: ఈ కథనం వైద్య నిపుణుల సూచనలు మరియు ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న అంశాల ఆధారంగా రూపొందించబడింది. oneindia దీనిని ధృవీకరించలేదు.












Click it and Unblock the Notifications