ల్యాప్‌టాప్ ఒడిలో పెట్టుకుని వాడితే మీ సంసారం బుగ్గిపాలే ..!
వర్క్ ఫ్రమ్ హోమ్ సంస్కృతి పెరిగిన తర్వాత చాలామంది తమ ఇళ్ల నుంచే పనిచేస్తున్నారు. ఈ సమయంలో కంఫర్ట్‌గా ఉండేందుకు ల్యాప్‌టాప్‌లను రకరకాలుగా ఉపయోగిస్తున్నారు. అయితే, ముఖ్యంగా ల్యాప్‌టాప్‌ను ఒడిలో పెట్టుకుని ఎక్కువసేపు పనిచేయడం వల్ల మన శరీరంపై తీవ్రమైన చెడు ప్రభావాలు పడుతున్నాయని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.
ల్యాప్‌టాప్ వల్ల కలిగే ప్రధాన నష్టాలు:
పురుషులలో ఈ సమస్యలు ఎక్కువగా కనిపిస్తాయి. ల్యాప్‌టాప్ నుంచి వెలువడే అధిక వేడి వృషణాల ప్రాంతాన్ని ప్రభావితం చేస్తుంది.దీని వలన స్పెర్మ్ నాణ్యత దెబ్బతిని, పునరుత్పత్తి సామర్థ్యంపై చెడు ప్రభావం చూపుతుంది. మగవారు ల్యాప్‌టాప్‌ల వినియోగంలో ప్రత్యేక శ్రద్ధ వహించాలి.

వైఫై రేడియేషన్ ప్రభావం:
ల్యాప్‌టాప్ నిరంతరం వైఫైకి కనెక్ట్ అయి ఉండటం వల్ల తక్కువ ఫ్రీక్వెన్సీ రేడియేషన్ విడుదలవుతుంది. ఒడిలో పెట్టుకున్నప్పుడు ఈ రేడియేషన్ నేరుగా శరీరంపై పడుతుంది.ఇది నిద్రలేమి , తీవ్రమైన తలనొప్పి వంటి సమస్యలకు దారితీయవచ్చు.
కండరాల నొప్పులు ):
ల్యాప్‌టాప్‌ను ఒడిలో పెట్టుకుని సరిగా కూర్చోకపోవడం వల్ల భంగిమ దెబ్బతింటుంది.రేడియేషన్ మరియు వేడి ప్రభావంతో పాటు, కూర్చోవడం వల్ల మెడ, భుజాలు మరియు వీపు కండరాలలో నొప్పి వస్తుంది.
తీసుకోవాల్సిన జాగ్రత్తలు:
ల్యాప్‌టాప్‌ను ఎప్పుడూ ఒడిలో పెట్టుకుని వాడకండి. దానికి బదులుగా, టేబుల్ లేదా డెస్క్‌పై పెట్టుకుని పనిచేయండి.ఎర్గోనామిక్ సెటప్ ఉపయోగించండి. అంటే, మీ కళ్లు స్క్రీన్ పైభాగానికి సమాంతరంగా ఉండేలా చూసుకోండి.ప్రతి గంటకు కనీసం 5-10 నిమిషాలు విరామం తీసుకుని, కొద్ది దూరం నడవండి. ల్యాప్‌టాప్ మన పనికి అత్యవసరం అయినప్పటికీ, దానిని సరైన పద్ధతిలో వాడుకోవాల్సిన బాధ్యత మనపై ఉంది.












Click it and Unblock the Notifications