Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

world kidney day: మూత్రపిండాలను కాపాడుకోండి ఇలా!!

ఈరోజు ప్రపంచ కిడ్నీ దినోత్సవం. మూత్రపిండాలు మన శరీరంలోని ముఖ్యమైన అవయవం. కిడ్నీలు బాగుంటేనే మిగతా అవయవాలు సరిగ్గా పని చేస్తాయి. అందుకు కిడ్నీల ఆరోగ్యం కాపాడుకోవాల్సిన అవసరం ఉంది.

ఈరోజు ప్రపంచ కిడ్నీ దినోత్సవం. మూత్రపిండాలు మన శరీరంలోని ముఖ్యమైన అవయవం. మన శరీరంలో రక్తాన్ని శుద్ధి చేసి శరీర భాగాలకు సరఫరా చేయడంలో మూత్రపిండాల పాత్ర గణనీయమైనది. ఎప్పటికప్పుడు రక్తంలో చేరే మలినాలను వడపోసి మూత్రం రూపంలో బయటకు పంపి మనిషి ఆరోగ్యాన్ని కాపాడతాయి మూత్రపిండాలు. అటువంటి మూత్రపిండాల విషయంలో నిర్లక్ష్యం ఏమాత్రం మంచిది కాదు.

మూత్రపిండాలు సరిగ్గా పని చేయకపోతే ఇతర అవయవాలపై ఎఫెక్ట్

మూత్రపిండాలు సరిగ్గా పని చేయకపోతే ఇతర అవయవాలపై ఎఫెక్ట్

మూత్రపిండాలను ఆరోగ్యంగా ఉంచుకోకపోతే అనేక రకాల సమస్యలను ఎదుర్కోవలసి వస్తుంది. ప్రతి సంవత్సరం ప్రపంచ కిడ్నీ దినోత్సవం సందర్భంగా, మూత్రపిండాల ఆరోగ్యం పైన ప్రతి ఒక్కరు దృష్టి సారించాల్సిన అవసరం ఉంది అనే విషయాన్ని చెబుతున్నారు వైద్యులు. శరీరంలో అత్యంత కీలకమైన మూత్రపిండాలు సక్రమంగా పనిచేస్తేనే ఇతర శరీర అవయవాలు సక్రమంగా పనిచేస్తాయి. మూత్రపిండాలు సరిగ్గా పని చేయకపోతే శరీరంలోని ఇతర అవయవాలు కూడా దెబ్బతినే ప్రమాదం ఉంటుంది. కాబట్టి మూత్రపిండాలను ఆరోగ్యంగా చూసుకోవడం చాలా ముఖ్యం .

డయాబెటిస్ తో మూత్రపిండాలకు కష్టం

డయాబెటిస్ తో మూత్రపిండాలకు కష్టం


మూత్రపిండాలకు సంబంధించి ఎటువంటి సమస్యలు రాకుండా చూసుకోవాలంటే ముఖ్యంగా డయాబెటిస్, బిపి వంటి సమస్యలు రాకుండా చూసుకోవాలి. డయాబెటిస్ ఉన్నవారికి, బీపీ ఉన్నవారికి మూత్రపిండాల సమస్యలు ఎక్కువగా వచ్చే అవకాశం ఉంటుంది. రక్తంలో చక్కెర స్థాయి ఎక్కువగా ఉంటే మూత్రపిండాలకు వాటిని వడపోయడం కష్టంగా మారుతుంది. దీంతో అవి మామూలుగా పని చేసే దానికంటే అదనంగా పనిచేయాల్సి వస్తుంది. ఈ క్రమంలో అవి త్వరగా పాడైపోయే అవకాశం ఉంటుంది. అందుకే డయాబెటిస్ బాధితులు ఎప్పుడు రక్తంలో చక్కెర స్థాయిని కంట్రోల్లో పెట్టుకోవాలి.

 రక్తపోటు తో మూత్రపిండాలకు నష్టం

రక్తపోటు తో మూత్రపిండాలకు నష్టం


ఇక రక్త పోటు సమస్య ఉన్నప్పటికీ మూత్రపిండాల సమస్య వచ్చే ప్రమాదం ఉంటుంది. రక్తపోటు కారణంగా రక్తం వేగంగా ప్రవహించి, మూత్రపిండాలలో ఉండే ఫిల్టర్లు దెబ్బతిని, రక్తం శుద్ధి కాకుండా శరీరంలోని అవయవాలకు చేరుతుంది. ఇక ఈ ప్రక్రియ ఇలా కొనసాగితే మూత్రపిండాలు పూర్తిగా పనిచేయడం మానేస్తాయి. కాబట్టి డయాబెటిస్ బాధితులు, బీపీ బాధితులు కచ్చితంగా వాటిని కంట్రోల్ లో పెట్టుకోవాల్సిన అవసరం ఉంది. వారు మూత్రపిండాల విషయంలో ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకోవాలని వైద్యులు చెబుతున్నారు.

ఒబేసిటీ, ధూమపానం, మద్యపానంతో కిడ్నీలకు డేంజర్

ఒబేసిటీ, ధూమపానం, మద్యపానంతో కిడ్నీలకు డేంజర్


ఇక ధూమపానం, మద్యపానం అలవాటు ఉన్న వారిలోనూ మూత్రపిండాల సమస్య తలెత్తే అవకాశం ఉంటుంది. కాబట్టి ఆరోగ్యాన్ని పాడుచేసే, మూత్రపిండాలకు నష్టం చేసే ధూమపానం మద్యపానం అలవాట్లను మానుకోవాలి. అంతేకాదు అధిక బరువు కూడా మూత్రపిండాల పైన తీవ్రమైన ప్రభావాన్ని చూపిస్తుంది. ఒబేసిటీ ఉన్నవారిలో శరీరంలో టాక్సిన్లు పేరుకుపోయి, వాటిని శుద్ధి చేసే క్రమంలో మూత్రపిండాలపై విపరీతమైన ఒత్తిడి పడుతుంది. ఇక మూత్రపిండాలపై ఒత్తిడి పెడితే అవి పని చేయడం మానేస్తాయి. కాబట్టి ఒబేసిటీ కూడా మూత్రపిండాల సమస్యలకు ఒక కారణమని చెప్పొచ్చు.

మూత్రపిండాల ఆరోగ్యం కోసం ఈ పనులు చెయ్యండి

మూత్రపిండాల ఆరోగ్యం కోసం ఈ పనులు చెయ్యండి


కాబట్టి మూత్రపిండాల ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి అనుకునేవారు ఆరోగ్యం విషయంలో, ఆహారం విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి. ప్రతిరోజు నాలుగు నుండి ఐదు లీటర్ల నీటిని తాగాలి. ప్రతిరోజు వ్యాయామం చేయాలి. ప్రతి చిన్న నొప్పికి, ప్రతి అనారోగ్య సమస్యకు పెయిన్ కిల్లర్స్, యాంటీబయాటిక్స్ వాడకూడదు. ఇక మూత్రపిండాల ఆరోగ్యం కోసం ఏడాదికి రెండుసార్లు అయినా పరీక్షలు చేయించుకోవాలి. ఏవైనా అనారోగ్య సమస్యలు ఉంటే ప్రాథమిక దశలోనే గుర్తించి చికిత్స తీసుకుంటే మూత్రపిండాలకు వచ్చే సమస్యల నుండి బయటపడవచ్చు.

disclaimer: ఈ కథనం వైద్య నిపుణుల సూచనలు మరియు ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న అంశాల ఆధారంగా రూపొందించబడింది. oneindia దీనిని ధృవీకరించలేదు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+