ఈ ఆసనాలతో డయాబెటిస్ ముప్పు దూరం - ఎన్నో ఫలితాలు..!!

యోగా. క్రమం తప్పకుండా యోగా చేయడం వల్ల మానసిక ప్రశాంతతకు తోడ్పడుతుంది. దీర్ఘ కాలిక రోగాలకు పరిష్కారం చూపుతోంది. నిత్యం యోగా చేయటం ద్వారా షుగరు వంటి సమస్యలు నియంత్రణలో ఉంటాయి. డయాబెటీస్ ఒకసారి వచ్చిందంటే నయమయ్యేది కాదు. డయాబెటీస్ కు యోగా ఎంతగానో తోడ్పడుతున్నట్లు రిసెర్చ్ లు వెల్లడించాయి. యోగాలోని ఆసనాలతో షుగరు తో పాటుగా ఆనారోగ్య సమస్యలు ఎన్నో దూరం అవుతాయి.

డయాబెటీస్ రావటానికి అనేక కారణాలు ఉన్నాయి. అందులో మానసిక ఒత్తిడీ ప్రధాన కారణంగా ఉంది దీంతో సింపథెటిక్ నాడీ వ్యవస్థ, అడ్రినల్ గ్రంథి ఉత్తేజితమై రక్తంలోకి గ్లూకోజు ఎక్కువగా విడుదలవుతుందని, కణాల్లోకి గ్లూకోజు వెళ్లేలా చేసే ఇన్సులిన్ హార్మోన్ పనితీరు అస్తవ్యస్తం గా మారుతుంది. ఈ క్రమంలో క్రమం తప్పకుండా యోగా చేయడం వల్ల మానసిక ప్రశాంతతకు తోడ్పడుతుందని నిపుణులు చెబుతున్నారు. ఆసనాలతో కండరాలకు రక్త సరఫరా పెరుగుతుందని, అంతేకాకుండా ఇన్సులిన్ గ్రాహకాల వ్యక్తీకరణ ఇనుమడించటం వల్ల గ్లూకోజును బాగా స్వీకరిస్తాయి. ప్రాణాయామం, ధ్యానం వంటి వాటితో మానసిక ప్రశాంతత చేకూరుతుంది.
యోగాలో ధ్యానంతో పాటుగా ఎన్నో రకాల ఆసనాలు శరీరానికి మేలు చేస్తాయి.

yoga-practise-helpful-tool-in-managing-diabetes-as-study-report

యోగాలో వేసే త్రికోణాసనం షుగరు వ్యాధి గ్రస్తులకు ప్రయోజన కరంగా ఉంటుంది. అదే విధంగా చక్రాసనం ఆరు సార్లు చేయటం ద్వారా మేలు జరుగుతుందని నిపుణులు చెబుతున్నారు. పది నిమిషాల పాటు శవాసనం అవసరం. ఇందులో ప్రశాంతంగా వెల్లకిలా పడుకోవాలి. కళ్లు మూసుకొని పాదాల దగ్గర నుంచి తల వరకూ ఒక్కొ అవయవం మీద దృష్టి సారిస్తూ అవన్నీ బాగా విశ్రాంతి పొందుతున్నట్లు భావించాలి. ఇక.. సూర్య నమస్కారాలు 12 దశల్లో చేయాలి. సూర్య నమస్కారాల్లో ప్రణామ, హస్తోత్థావ, హస్తపాద, అశ్వసంచాలన, దండ, అష్టాంగ నమస్కార, భుజంగ, అదోముఖస్వాన, అశ్వ సంచాలన, హస్తపాద, హస్తోత్థావ, ప్రణామ ఆసనాలను ఒక క్రమపద్ధతిలో చేయాలి. అర్ధమత్స్యేంద్రాసనం, పవన ముక్తాసనం, భుజంగాసనం, పాదచక్రాసనం, ధనురాసం వంటివి చేయటం ద్వారా శరీరానికి ఆరోగ్య పరమైన ప్రయోజనాలు ఉన్నాయి. ఇక 5 సార్లు భస్త్రిక చేయాలి. ఇందులో నాలుగు సార్లు శ్వాసను వీలైనంత వేగంగా తీసుకొని, వదిలిపెట్టాలి. ఆ తర్వాత ఒకసారి గాఢంగా శ్వాస తీసుకొని, నెమ్మదిగా వదలాలి. ఇలా ప్రతీ ఆసనం.. భంగిమ శరీరంలో ఒక్కో అవయవానికి మేలు చేస్తుంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+