పోలీసుల అదుపులో 7వేల మందికిపైగా సీజేపీ నిరసనకారులు.. UNHRC ఆందోళన.. తక్షణమే రిలీజ్ చేయాలంటూ..

భారత ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేశ్ కుమార్ రాజీనామా చేయాలన్న డిమాండ్‌ తో కాక్రోచ్ జనతా పార్టీ(సీజేపీ) అక్టోబర్ 10 న భారీ నిరసనలకు పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో దేశ రాజధాని దిల్లీలోని జంతర్‌ మంతర్ వద్దకు భారీ సంఖ్యలో యువతీయువకులు తరలివస్తుండగా పోలీసులు ఎక్కడికక్కడ నిరసన కారులను అదుపులోకి తీసుకుంటున్నారు. శనివారం సాయంత్రం నాటికి దాదాపు 7 వేల మందికి పైగా నిరసనకారులను పోలీసులు నిర్బంధించినట్లు సమాచారం. అలాగే ముంబై నుంచి దిల్లీ చేరుకున్న సీజేపీ వ్యవస్థాపకుడు అభిజిత్ దిప్కేతో పాటు అధికార ప్రతినిధులు సౌరభ్ దాస్, అశుతోష్ రాంకాలను పోలీసులు నిర్బంధించారు. వారు ప్రయాణించిన విమానం దిల్లీలో ల్యాండ్ కాగానే పోలీసులు సీజేపీ నేతలను అదుపులోకి తీసుకున్నారు. ఆ తర్వాత వారిని అజ్ఞాతప్రాంతానికి తరలించారు.

అయితే దేశంలో జరుగుతున్న అక్రమ నిర్బంధాలపై యూనైటెడ్ నేషన్స్ హ్యూమన్ రైట్స్ కమిటీ(UNHRC) తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. వారిని శాంతియుతంగా నిరసనలు తెలిపేందుకు అవకాశం ఇవ్వాలని విజ్ఞప్తి చేసింది. అలాగే నిర్బంధంలో ఉన్న నిరసనకారులను తక్షణమే విడుదల చేయాలని స్పష్టం చేసింది. ఈ మేరకు తన ఎక్స్ ఖాతాలో పోస్టు చేసింది. ఈ అంశంపై భారత్ లోని UNHRC అధికార ప్రతినిధి తమీన్ అల్ ఖీతన్ కీలక వ్యాఖ్యలు చేశారు.

" ప్రస్తుతం భారత్ లో భారీ స్థాయిలో జరుగుతున్న మాస్ నిర్బంధాలపై మేము ఆందోళన వ్యక్తం చేస్తున్నాం. నిరసనకారులు, నేతలు, సివిల్ సొసైటీ ఆర్గనైజేషన్స్ సభ్యులు, లాయర్లు, జర్నలిస్టులను నిర్బంధించినట్లు కథనాలు వస్తున్నాయి. వారు శాంతి యుతంగా నిరసనలు తెలిపేందుకు అంగీకారం తెలపడం పూర్తిగా గౌరవప్రదమైనదిగా భావిస్తున్నాం. పరిస్థితులు కఠినంగా మారితే తప్ప శాంతియుతంగా నిరసన తెలిపేవారిపై ఆంక్షలు విధించవద్దు. దేశ ప్రజాస్వామ్యం, మానవ హక్కుల బాధ్యతలకు అనుగుణంగా శాంతి యుతంగా నిరసన తెలిపే వారి పట్ల బలగాలు సంయమనం పాటించాలి. నిర్బంధించిన వారిని తక్షణమే రిలీజ్ చేయాలి" అని UNHRC ఓ ప్రకటన విడుదల చేసింది.

UNHRC expresses concern over the detention of CJP protesters urges their immediate release latest

మరోవైపు దిల్లీలో ఆంక్షలు, ప్రతిపక్ష నేతల నిర్బంధాలపై దాఖలైన పిటిషన్లను సుప్రీంకోర్టు అక్టోబర్ 11 ఆదివారం రోజున ప్రత్యేకంగా విచారణ చేపట్టనుంది. అక్టోబర్ 09న సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాలను పోలీసులు ఉల్లంఘించారంటూ దాఖలైన కోర్టు ధిక్కరణ పిటిషన్‌ తో పాటు.. నిరసన కారుల నిర్బంధాన్ని సవాల్ చేస్తూ దాఖలైన హెబియస్ కార్పస్ పిటిషన్లపై సుప్రీంకోర్టు ధర్మాసనం విచారణ చేపట్టనుంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+