టికెట్ రేట్ల పెంపుపై విజయ్ దేవరకొండ షాకింగ్ కామెంట్స్ వైరల్..

టాలీవుడ్ రౌడీ బాయ్ విజయ్ దేవరకొండ ప్రస్తుతం 'రణబాలి' చిత్రం ప్రొమోషన్స్ లో బిజీగా ఉన్నారు. కెరీర్ లో తొలిసారి చారిత్రాత్మక నేపథ్యం ఉన్న సినిమాలో విజయ్ దేవరకొండ నటిస్తున్న సంగతి తెలిసిందే. ఇటీవల వచ్చిన రణబాలి ట్రైలర్ సినిమాపై అంచనాలను భారీగా పెంచేసింది. ఈ మూవీ దసరా కానుకగా అక్టోబర్ 16 న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ కానుంది. రిలీజ్ కు ఐదు రోజులే సమయం ఉన్న నేపథ్యంలో చిత్ర యూనిట్ ప్రొమోషన్స్ ను వేగవంతం చేసింది.

అయితే సాధారణంగా ఇటీవలి కాలంలో ఏ పెద్ద సినిమా రిలీజ్ అయినా టికెట్ రేట్ల పెంపు అంశం ముందుకు వస్తోంది. తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు టికెట్ రేట్లను పెంచుతూ వస్తున్నాయి. అయితే ఈ విధానంపై విజయ్ దేవరకొండ తాజాగా షాకింగ్ కామెంట్స్ చేశారు. తన సినిమాలకు టికెట్ రేట్ల పెంపు అవసరం లేదని తెలిపారు. ఈ వ్యవహారం తన పరిధిలో ఉన్నంత వరకూ టికెట్ పెంపు లేకుండా చూస్తానని స్పష్టం చేశారు. రణబాలి మూవీ విడుదల వేళ, టికెట్ల ధరల పెంపు గురించి సోషల్ మీడియాలో రకరకాల ఊహాగానాలు చక్కర్లు కొడుతున్న క్రమంలో ఆయన వ్యాఖ్యలు ప్రస్తుతం టాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారాయి.

అయితే విజయ్ నిర్ణయంలో ఓ మెలిక కూడా ఉంది. ఒకవేళ భవిష్యత్తులో ఎస్ ఎస్ రాజమౌళి లాంటి దిగ్గ‌జ ద‌ర్శ‌కుడి సినిమాలో నటించే అవకాశం వస్తే మాత్రం ఆ ఒక్క సినిమాకు మినహాయింపు ఉంటుందని, మిగతా అన్ని సినిమాలకూ సాధారణ ధరలే వర్తిస్తాయని ఆయన కుండబద్దలు కొట్టిన‌ట్లు తెలుస్తోంది. అయితే విజయ్ కామెంట్స్ పై అతని టీమ్ నుంచి కానీ రణబాలి చిత్ర యూనిట్ నుంచి కానీ ఇప్పటివరకూ ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. ఇదిలాఉంటే టికెట్ రేట్ల పెంపు విషయంలో విజయ్ నిర్ణయాన్ని ఫ్యాన్స్ స్వాగతిస్తున్నారు. ఈ మేరకు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

VijayDeverakonda tollywood rowdy hero makes shocking comments on the hike in ticket prices go viral

ఇక విజయ్ దేవరకొండ రణబాలి మూవీ అక్టోబర్ 16 నుంచి థియేటర్లలో సందడి చేయనుంది. ఈ మూవీలో విజయ్ సరసన రష్మిక హీరోయిన్ గా నటించింది. అలాగే హాలీవుడ్ నటుడు ఆర్నాల్డ్ ఓస్లో శక్తివంతమైన విలన్ పాత్రలో నటిస్తున్నారు. ఈ చిత్రాన్ని దర్శకుడు రాహుల్ సాంకృత్యాన్ ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించారు. మైత్రి మూవీ మేకర్స్ చిత్ర నిర్మాతలుగా వ్యవహరించారు. ఈ చిత్రానికి అజయ్- అతుల్ ద్వయం మ్యూజిక్ అందించారు. భారీ అంచనాల మధ్య రిలీజ్ అవుతున్న ఈ మూవీతో విజయ్ గట్టి కమ్ బ్యాక్ ఇవ్వాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+