పెళ్లి చేసుకుంటే పిల్లలను కనాల్సిందేనా? ఈ హీరోయిన్‌ క్లారిటీ వింటే షాకవ్వాల్సిందే!

పెళ్లి తర్వాత మహిళలు పిల్లలను కనడం సహజమే.. మాతృత్వంలోనే ఓ మహిళ జీవితం పరిపూర్ణం అవుతుందంటారు. అయితే వ్యక్తిగత పరిస్థితులు, కెరీర్‌, కుటుంబ బాధ్యతలు, తమకు ఉన్న ప్రాధాన్యతలను బట్టి కొందరు దంపతులు పేరెంట్‌హుడ్‌ను వాయిదా వేసుకుంటున్నారు. మరికొందరు పిల్లలను కనకూడదని నిర్ణయించుకుంటున్నారు. ఈ నిర్ణయం పూర్తిగా వ్యక్తిగతమైనదేనని పలువురు అభిప్రాయపడుతున్నారు. తాజాగా నటి వరలక్ష్మి శరత్ కుమార్ (Varalaxmi Sarathkumar) కూడా పిల్లలపై ఇదే తరహా కామెంట్స్ చేశారు. ఇంతకీ ఏమన్నారంటే?

 మహేష్ బాబు - ప్రభాస్ కాంబినేషన్‌లో మిస్ అయిన బ్లాక్‌బస్టర్
మహేష్ బాబు - ప్రభాస్ కాంబినేషన్‌లో మిస్ అయిన బ్లాక్‌బస్టర్

ఇటీవల వరలక్ష్మి శరత్ కుమార్ ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. తనకు ప్రస్తుతం పిల్లలను కనాలనే ఆలోచన లేదని క్లియర్ గా చేశారు. అయితే ఇది శాశ్వత నిర్ణయం కాదని, భవిష్యత్‌లో పరిస్థితులను బట్టి తన ఆలోచన మారే అవకాశం ఉందని కూడా ఆమె పేర్కొన్నారు. ఒకప్పుడు పెళ్లి చేసుకోవాలని కూడా అనుకోలేదని, కానీ తర్వాత తన జీవితంలో వివాహం జరిగిందని గుర్తుచేశారు. భవిష్యత్‌లో కూడా ఈ నిర్ణయంపై ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారో? ఏం జరుగుతుందో ఇప్పుడేం చెప్పలేమని అన్నారు. మాతృత్వాన్ని కేవలం బిడ్డకు జన్మనివ్వడంతో మాత్రమే నిర్వచించలేమని వరలక్ష్మి అభిప్రాయపడ్డారు.

Varalaxmi Sarathkumar Says She Has No Plans for Children Opens Up About Motherhood
అప్పుడే ఓటీటీలోకి నాని 'ప్యారడైజ్' సినిమా.. ఆ రోజు నుంచే స్ట్రీమింగ్
అప్పుడే ఓటీటీలోకి నాని 'ప్యారడైజ్' సినిమా.. ఆ రోజు నుంచే స్ట్రీమింగ్

తన చెల్లిని తాను తల్లిలా చూసుకుంటానని, తన పెట్ డాగ్స్‌ను కూడా పిల్లల్లాగే భావిస్తానని చెప్పారు. స్నేహితులు, సన్నిహితులు లేదా తన సహాయం అవసరమైన వారికి అండగా నిలవడంలోనూ అదే అనుభూతిని పొందుతానని తెలిపారు. తనకు తెలిసినంత వరకు మాతృత్వం అంటే ప్రేమతో పాటు బాధ్యత తీసుకోవడం, అవసరమైనప్పుడు తోడుగా నిలవడమని ఆమె వివరించారు. పిల్లలను పెంచడం అనేది పెద్ద బాధ్యత అని పేర్కొన్న వరలక్ష్మి.. ఆ బాధ్యతను స్వీకరించేందుకు సిద్ధంగా లేనప్పుడు కేవలం ఇతరుల ఒత్తిడి కారణంగా పేరెంట్‌హుడ్‌ను ఎంచుకోవాల్సిన అవసరం లేదనే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. పిల్లలను కనడం లేదా వద్దనుకోవడం అనేది వ్యక్తిగత నిర్ణయమన్నారు.

దేవతలతో పెట్టుకోకండి.. నాని 'ది ప్యారడైజ్'కు వేణుస్వామి సీరియస్ వార్నింగ్!
దేవతలతో పెట్టుకోకండి.. నాని 'ది ప్యారడైజ్'కు వేణుస్వామి సీరియస్ వార్నింగ్!

వరలక్ష్మి శరత్ కుమార్ సినీ ప్రయాణం విషయానికి వస్తే.. 2012లో 'పోడా పోడి' సినిమాతో హీరోయిన్‌గా తెరంగేట్రం చేశారు. ఆ తర్వాత తమిళంతో పాటు తెలుగు, మలయాళం, కన్నడ చిత్రాల్లోనూ నటించారు. హీరోయిన్ పాత్రలకే పరిమితం కాకుండా ప్రతినాయక పాత్రలు, క్యారెక్టర్ ఆర్టిస్ట్ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. విక్రమ్ వేద, క్రాక్, నాంది, వీరసింహారెడ్డి, మైఖేల్, హనుమాన్ వంటి సినిమాలు ఆమెకు తెలుగులోనూ మంచి గుర్తింపు తీసుకొచ్చాయి.

Ravi Teja: ఇరుముడి తర్వాత రవితేజ నెక్స్ట్ మూవీ ఫిక్స్.. టైటిల్ అనౌన్స్‌మెంట్‌లోనే బిగ్ సర్‌ప్రైజ్!
Ravi Teja: ఇరుముడి తర్వాత రవితేజ నెక్స్ట్ మూవీ ఫిక్స్.. టైటిల్ అనౌన్స్‌మెంట్‌లోనే బిగ్ సర్‌ప్రైజ్!

ఇక వ్యక్తిగత జీవితంలో ముంబైకి చెందిన ఆర్ట్ గ్యాలరిస్ట్ నికోలాయ్ సచ్‌దేవ్ (Nicholai Sachdev) ను వరలక్ష్మి 2024లో వివాహం చేసుకున్నారు. కుటుంబ సభ్యుల అంగీకారంతో థాయ్‌లాండ్‌లో వీరి వివాహం జరిగింది. నికోలాయ్‌కు గత వివాహం ద్వారా ఓ కుమార్తె ఉంది. ఆమెను తన కుమార్తెలాగే చూసుకుంటానని వరలక్ష్మి గతంలో వెల్లడించారు. తమ ఇంట్లో ఉన్న పెట్ డాగ్స్‌ను కూడా కుటుంబంలో భాగంగానే భావిస్తామని చెప్పారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+