పుట్టిన నెలను బట్టి మీకీ వ్యాధులు వచ్చే ఛాన్స్.. జాగ్రత్త!
పుట్టిన నెలలను బట్టి మనకు వచ్చే వ్యాధులు కూడా ఆధారపడి ఉంటాయి. ఏ నెలలో పుట్టిన వారు ఎటువంటి వ్యాధుల బారిన పడతారు అనేది ఒక అధ్యయనంలో వెల్లడయింది. జనవరి నుంచి డిసెంబర్ వరకు ఉన్న మొత్తం 12 నెలల్లో ఒక్కొక్క నెలకు ఒక్కొక్క ప్రాధాన్యత ఉంటుంది. ఇక ఈ నెలలలో పుట్టిన వారికి ఎటువంటి సమస్యలు వస్తాయి అనేది ప్రస్తుతం మనం తెలుసుకుందాం.
జనవరి, ఫిబ్రవరి మార్చి నెలల్లో పుడితే వచ్చే వ్యాధులివే
జనవరి మాసంలో పుట్టిన వారికి వెన్నునొప్పి, మైగ్రేన్, మలబద్ధకం, అల్సర్స్, గుండెపోటు, స్త్రీలకు మెనోపాజ్ వంటి సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది. ఫిబ్రవరి మాసంలో పుట్టిన వారికి గుండె జబ్బులు, ఆర్థరైటిస్, రక్తంలో గడ్డలు ఏర్పడడం, థైరాయిడ్ వంటి సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది, మార్చి నెలలో పుట్టిన వారికి గుండె జబ్బులు, ఆస్తమా, రుమటాయిడ్ ఆర్థరైటిస్, కంటి శుక్లాలు వంటి సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది.

ఏప్రిల్, మే, జూన్ లలో పుడితే వచ్చే రోగాలివే
ఏప్రిల్ మాసంలో పుట్టిన వారికి థైరాయిడ్, ఆస్టియోపోరోసిస్, ట్యూమర్లు, బ్రాంకైటిస్, ఆస్తమా వంటి సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది .మే నెలలో పుట్టిన వారికి ఆస్తమా, డయాబెటిస్, అలర్జీలు, మలబద్దకం, డిప్రెషన్ వంటి సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది. జూన్ నెలలో పుట్టిన వారికి కంటి శుక్లాలు, గుండె జబ్బులు, బ్రాంకైటిస్, రుమటాయిడ్ ఆర్థరైటిస్ వంటి సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది.
జులై, ఆగస్ట్, సెప్టెంబర్ లో పుట్టినవారికి ఈ వ్యాధులకు అవకాశం
జులై నెలలో పుట్టిన వారికి మెడనొప్పి, ఆర్థరైటిస్, ఆస్తమా, ట్యూమర్లు సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది. ఆగస్ట్ నెలలో పుట్టిన వారికి ఆస్తమా, థైరాయిడ్, పెద్ద ట్యూమర్ల వంటి సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది. సెప్టెంబర్ నెలలో పుట్టిన వారికి మానసిక సమస్యలు, గుండె సమస్యలు, రక్తహీనత వంటి సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది.
అక్టోబర్, నవంబర్, డిసెంబర్ లలో పుట్టినవారికి ఈ రోగాలకు అవకాశం
అక్టోబర్ నెలలో పుట్టిన వారు మైగ్రేన్, థైరాయిడ్, రక్తహీనత, కొలెస్ట్రాల్, ఆస్టియోపోరోసిస్ వంటి సమస్యలతో బాధపడే అవకాశం ఉంటుంది. నవంబర్ నెలలో పుట్టిన వారు థైరాయిడ్, వెరికోస్ వెయిన్స్, చర్మ సమస్యలు, గుండె జబ్బులు వంటి వాటితో ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది. డిసెంబర్ మాసంలో పుట్టిన వారు డిప్రెషన్, గుండె జబ్బులు, బ్లడ్ క్లాట్స్, బ్రాంకైటిస్, కంటి శుక్లాల వంటి సమస్యలతో ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది.
disclaimer: ఈ కథనం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న అంశాల ఆధారంగా రూపొందించబడింది. oneindia దీనిని ధృవీకరించలేదు.












Click it and Unblock the Notifications