కాస్మొటిక్స్ తో కాదు ఈ ఆహారాలతో మీ చర్మానికి నిగారింపు.. ట్రై చెయ్యండి!
చాలామంది చర్మం అందంగా ఉండడం కోసం, ఆరోగ్యంగా ఉండడం కోసం రకరకాల ప్రయోగాలు చేస్తారు. చర్మం నికారింపును సొంతం చేసుకోవడానికి రకరకాల కాస్మోటిక్స్ ను ఉపయోగిస్తారు. అయితే ఎటువంటి సౌందర్య క్రీములు ఉపయోగించకుండా కేవలం మంచి ఆహారంతోనే చర్మం మెరిసిపోయేలా చేయవచ్చని చెబుతున్నారు వైద్య నిపుణులు.
చర్మానికి ఆహారంతో పోషణ
చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచడానికి అవసరమైన పోషణ అందించడానికి కొన్ని ఆహారాలు ఎంతగానో దోహదం చేస్తాయని చెబుతున్నారు. చర్మ సౌందర్యాన్ని మరింత పెంచే, అద్భుతమైన నిగారింపును ఇచ్చే అటువంటి ఆహారం గురించి ప్రస్తుతం మనం తెలుసుకుందాం. మనం తినే ఆహారంలో పోషకాలు పుష్కలంగా ఉండే ఆహారాలు చర్మ ఆరోగ్యానికి దోహదం చేస్తాయి.

అవకాడో
చర్మం ఆరోగ్యంగా అందంగా ఉండాలంటే, నిగారింపును సొంతం చేసుకోవాలంటే అవకాడో ఎంతగానో దోహదం చేస్తుంది. అవకాడోలో విటమిన్ ఏ, విటమిన్ సి, విటమిన్ ఈ పుష్కలంగా లభిస్తాయి. ఇది మీ చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచుతాయి. కొల్లాజెన్ ఉత్పత్తిని పెంచుతాయి. ముఖం మీద ముడతలను నివారిస్తాయి.
ఆకుకూరలు కూరగాయలు
చర్మం ఆరోగ్యంగా ఉండడానికి ఆహారంలో బచ్చలికూరతో పాటు పాలకూర, తోటకూర వంటి ఆకుకూరలు ఎంతగానో దోహదం చేస్తాయి.ఇక ఆహారంలో గుమ్మడికాయ, దోసకాయ, టమాటా వంటి కూరగాయలు కూడా చర్మ ఆరోగ్యానికి ఉపయోగపడతాయి. వాటర్ కంటెంట్ ఎక్కువగా ఉండే పండ్లు, కూరగాయలను తింటే అవి చర్మాన్ని తేమగా ఉంచడంలో సహాయపడతాయి ఫలితంగా చర్మం నిగారింపును సొంతం చేసుకుంటుంది.
నట్స్ మరియు సీడ్స్
బాదంపప్పు, జీడిపప్పు వంటి వివిధ రకాల డ్రై ఫ్రూట్స్ ను తింటే చర్మం నిగారింపును సొంతం చేసుకుంటుంది. బయోటిన్, ప్రోటీన్, విటమిన్ ఈ తో ఉన్న నట్స్, సీడ్స్ మన చర్మాన్ని రక్షిస్తాయి. వృద్ధాప్య ప్రభావాలను తగ్గిస్తాయి.
నీరు ఎక్కువ తీసుకోవడం
వయసు పెరిగే కొద్దీ చర్మం పైన ముడతలు సహజంగా వస్తూ ఉంటాయి. అయితే రోజు శరీరానికి కావాల్సినంత నీటిని ఇస్తే ఇవి ముడతలు రాకుండా చేసి చర్మం హైడ్రేటెడ్ గా బిగుతుగా ఉండేలా చూస్తాయి. మీరు ఎక్కువగా నీటిని తాగడం వల్ల రక్తప్రసరణ కూడా మెరుగు అవుతుంది. అంతేకాదు ఇది చర్మానికి నిగారింపును ఇస్తుంది.
disclaimer: ఈ కథనం వైద్య నిపుణుల సూచనలు మరియు ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న అంశాల ఆధారంగా రూపొందించబడింది. oneindia దీనిని ధృవీకరించలేదు.












Click it and Unblock the Notifications