జీరో స్టేజ్ క్యాన్సర్... ఈ లక్షణాలుంటే అలెర్ట్!
ప్రస్తుతం ప్రపంచాన్ని పట్టిపీడిస్తున్న అతిపెద్ద మహమ్మారులలో క్యాన్సర్ ఒకటి. ఆధునిక వైద్యశాస్త్రం ఎంత అభివృద్ధి చెందినప్పటికీ క్యాన్సర్ మహమ్మారిని సమూలంగా నిరోధించే వైద్యం ఇంకా అందుబాటులోకి రాలేదు. క్యాన్సర్ బారిన పడినవారు అనుభవించే బాధ అంతా ఇంతా కాదు. అయితే ప్రాణాలను హరించే క్యాన్సర్ ముప్పును ప్రారంభ దశలోనే గుర్తించగలిగితే క్యాన్సర్ కు చికిత్స చేసి దానిని ప్రారంభ దిశలోనే తగ్గించవచ్చు.
జీరో స్టేజ్ లేదా ప్రీ క్యాన్సర్ కండిషన్
క్యాన్సర్ యొక్క ప్రారంభ దిశను జీరో స్టేజ్ లేదా ప్రీ క్యాన్సర్ కండిషన్ అంటారు. అయితే ప్రారంభ క్యాన్సర్ కొన్ని లక్షణాలను మనకు చూపిస్తుంది. ఈ ప్రారంభ లక్షణాలను సకాలంలో గుర్తించగలిగి సరైన వైద్యం తీసుకుంటే క్యాన్సర్ మహమ్మరి నుండి బయటపడవచ్చు. క్యాన్సర్ శరీరంలో వృద్ధి చెందడానికి ముందు ఎటువంటి లక్షణాలను చూపిస్తుంది అనేది ప్రస్తుతం మనం తెలుసుకుందాం.

శరీరంపై ఇవి కనిపిస్తే జాగ్రత్త
చాలామందికి శరీరంపై ఏదైనా పుండు అకస్మాత్తుగా ఏర్పడి అది మానకుండా పెరుగుతూ ఉంటుంది. ఇది ఖచ్చితంగా క్యాన్సర్ లక్షణం అయ్యే అవకాశం ఉంది. అయితే ఇది క్యాన్సర్ లక్షణంగా గుర్తించి నిర్లక్ష్యం చేయకుండా వైద్యున్ని సంప్రదించాలి. చాలామందికి శరీరంలో ఎక్కడైనా మొటిమలాంటిది మొదలై అది శరీరంలో పెరుగుతూ కనిపిస్తుంది. ఇక ఈ పరిస్థితి ఉంటే వెంటనే అప్రమత్తమై వైద్యుడిని సంప్రదించాలి.
విపరీతంగా బరువు తగ్గిపోతూ ఉంటే జాగ్రత్త
చాలామందికి శరీర భాగంలో బాల్స్ లాగా కదులుతూ గడ్డలు ఏర్పడతాయి. ఇటువంటి గడ్డలను గమనిస్తే వెంటనే వైద్యుడిని సంప్రదించి చికిత్స తీసుకోవాలి. ఇక ఎంత మంచి డైట్ తీసుకున్న కొంతమంది విపరీతంగా బరువు తగ్గిపోతూ ఉంటారు. వేగంగా బరువు తగ్గడం కూడా క్యాన్సర్ ప్రారంభ లక్షణం కావచ్చు. కాబట్టి వైద్యున్ని సంప్రదించి కచ్చితంగా చెక్ చేయించుకోవాలి.
మలబద్ధకం, విరేచనాలు లక్షణాలు ఉంటే జాగ్రత్త
కొంతమందికి ప్రారంభ దశ క్యాన్సర్ లక్షణాలలో భాగంగా మలబద్ధకం వేధిస్తుంది. కడుపు లేదా ప్రేవుల్లో క్యాన్సర్ ప్రారంభ దిశలో ఇటువంటి లక్షణాలు కనిపిస్తాయి. మరి కొంతమందికి ఎక్కువగా విరోచనాలు అవుతాయి. ఇలా విరోచనాలు అయినప్పటికీ కూడా కచ్చితంగా వైద్యుని సంప్రదించి చూపించుకోవాలి.
నాలుక, నోట్లో ఇలా ఉంటే జాగ్రత్త
కొంతమందికి నాలుక పైన తెల్లని మచ్చలు నోట్లో తెల్లని లేదా ఎర్రని మచ్చలు కనిపిస్తూ ఉంటాయి. ఇవి కూడా క్యాన్సర్ ప్రారంభ లక్షణాలు కావచ్చు. కాబట్టి వీటి విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి. కొంతమందికి తరచూ నోటి పూత వేధిస్తుంది. ఈ నోటి పూత దీర్ఘకాలంగా తగ్గకుండా ఉంటే అది కూడా క్యాన్సర్ ప్రారంభ దశ కావచ్చు. కాబట్టి నిర్లక్ష్యం చేయకుండా వెంటనే వైద్యున్ని సంప్రదించి చికిత్స చేయించుకోవాలి.
disclaimer: ఈ కథనం వైద్య నిపుణుల సూచనలు మరియు ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న అంశాల ఆధారంగా రూపొందించబడింది. oneindia దీనిని ధృవీకరించలేదు.












Click it and Unblock the Notifications