ప్రాంతీయ భాషల్లో నెంబర్ వన్ పోర్టల్ వన్ ఇండియా. హిందీ, ఆంగ్ల భాషలతో పాటు దక్షిణాది తెలుగు, తమిళం, కన్నడం, మలయాళ భాషల కూడలి ఇది. ఇందులో తేనెలూరే తెలుగు భాషా పోర్టల్ విశేష ప్రజాదరణ పొందింది. ఇటాలియన్ ఆఫ్ ద ఈస్ట్‌గా ప్రఖ్యాతి గాంచిన తెలుగు పట్ల మీ ప్రేమాభిమానాలను వ్యక్తం చేయడానికి "నా భాషాపఠనాన్ని నేను ప్రేమిస్తాను" అనే నినాదాన్ని ముందుకు తీసుకుని పోయే కార్యక్రమాన్ని చేపట్టింది.
"ఐ లవ్ రీడింగ్ మై లాంగ్వేజ్" ప్రచారం ద్వారా వన్ ఇండియా తెలుగు ప్రేమికులకు వ్యాడ్జెట్స్, బ్యాడ్జీల ద్వారా భాషా చరిత్రపై ప్రత్యేకమైన సమాచారాన్ని అందిస్తోంది. భాష పట్ల తమ ప్రేమాభిమానాలను వ్యక్తం చేయడానికి పాఠకుల కోసం సోషల్ పేజీల్లో పోల్స్ నిర్వహిస్తున్నాం.