పెళ్లయ్యాక చూడాలట తడాఖా
ఏ ముఖం పెట్టుకుని నా ఒక్కగానొక్క కూతురును పెళ్లి చేసుకుంటానని చెబుతున్నావు. నాకు నాలుగు ఫామ్ హౌస్‌లు, ఐదు భవనాలు, నాలుగు కార్లు ఉన్నాయి అన్నాడో ఓ పెద్ద మనిషి.
ఆ యువకుడు ఏ మాత్రం తొణక్కుండా - మీ అమ్మాయిని పెళ్లి చేసుకున్న తర్వాత ఆ ఆస్తంతా నాదే అవుతుంది కదండీ.. ఎందుకంటే నీ కూతురి భర్తగా నేనే వారసుడిని కదా.. పెళ్లయితే అవన్నీ నా దగ్గర కూడా ఉంటాయి కందడీ అన్నాడు.
.... ..... .....
ఓ బిక్షగాడు ఇంటి ముందుకు వచ్చి - ధర్మప్రభువులు.. మీకు కలిగింది ఎంతో కొంత దానం చేయండయ్యా.. అని అడిగాడు.
దానికి ఇంటి యజమాని ప్రతిస్పందిస్తూ - వెళ్లు.. ఇంట్లో మా ఆవిడ లేదు అన్నాడు.
నేను అడిగింది మీ ఆవిడను కాదండీ.. తినడానికి ఏమైనా పెట్టమంటున్నాను ఆ బిక్షగాడు.












Click it and Unblock the Notifications