భార్యే, కానీ సిస్టర్ అనాల్సిందే..
మిత్రుడు సోము రాము వాదులాటకు దిగారు. ఇద్దరి వాదనలకు మధ్య పొత్తు కుదరడం లేదు.
రాము చివరికి - "నువ్వు ఏదంటే అదే కరెక్ట్.. ఇక నేనేమీ మాట్లాడను.. నువ్వు ఇది పగలు అంటే పగలే.. రాత్రి అంటే రాత్రే.." అని చెప్పాడు.
"అదేమిటి, అలా ఎలా అవుతుంది?" అన్నాడు సోము.
"పిచ్చివాళ్లతో వాదనకు దిగితే ఎదుటివాళ్లకు పిచ్చెక్కుతుంది... అందుకని" చెప్పాడు రాము.
......... ....... .....
అతను ఓ నర్సును పెళ్లి చేసుకున్నాడు.
పెళ్లి తర్వాత "జీవితం ఎలా ఉంద"ని అడిగాడు మిత్రుడు
"ఏం చెప్పమంటావు...?" అన్నాడు నిరాశగా అతను
"ఏం..?" అని అడిగాడు మిత్రుడు
"సిస్టర్ అని పిలిస్తే తప్ప నా భార్య పలుకదు.. ప్రతిసారీ సిస్టర్ అని సంబోధించాల్సిందే..." చెప్పాడు అతను.












Click it and Unblock the Notifications