పెళ్లి చేసుకుంది ఆమె అక్కనే అట..
ఇద్దరు మిత్రులు బాగా మద్యం సేవించారు. ఆ తర్వాత వాళ్ల భార్యల మీదికి చర్చ వెళ్లింది.
మొదటి మిత్రుడు: ఇంటి ముందు భార్య అరస్తూ ఉంటుంది, ఇంటి వెనక కుక్క మొరుగతూ ఉంటుంది. నువ్వు మొదట ఎక్కడికి వెళ్తావు.
రెండో మిత్రుడు: కుక్క వద్దకే..
మొదటి మిత్రుడు: ఎందుకు..
రెండో మిత్రుడు: నన్ను చూసి కనీసం కుక్క మొరగడం ఆపుతుంది.. కానీ... ఆవిడ...
......... ........ .......
భర్త రోజూ తాగి ఇంటికి చాలా ఆలస్యంగా వస్తున్నాడు. అతనికి గుణపాఠం చెప్పాలని భార్య నిర్ణయించుకుంటుంది. ఓ రోజు రాత్రి దయ్యంలా వేషం వేసుకుంటుంది.
అతను గేటు తీసుకుని లోనికి రాగానే అతని ముందు దయ్యంలా దూకి భయటపెట్టడానికి ప్రయత్నిస్తుంది.
అతను తొణక్కుండా, బెణక్కుండా - "నువ్వు నన్నేం భయపెట్టలేవు. నేను పెళ్లి చేసుకుంది నీ అక్కనే" అని అన్నాడు.












Click it and Unblock the Notifications