భూతద్దాల దూరదృష్టి
ఓ యువకుడు మ్యారేజీ బ్యూరోలో పెళ్లి కూతురు కోసం అప్లయ్ చేసుకున్నాడు. మ్యారేజీ బ్యూరోకు చెందిన పెళ్లిళ్ల పేరయ్య ఓ అమ్మాయి చూపించాడు. కళ్లజోడు పెట్టుకున్న ఆ అమ్మాయిని అతను చూసిన తర్వాత సంభాషణ ఇలా సాగింది.
యువకుడు: అందమైన అమ్మాయిని సెట్ చేయమంటే భూతద్దాల కళ్లజోడు అమ్మాయిని సెట్ చేశారేమిటి...
పెళ్లిళ్ల పేరయ్య: అమ్మాయి రంభలాగా ఉంది కదయ్యా.
యువకుడు: ఉంటే ఆ అద్దాలేమిటి..
పెళ్లిళ్ల పేరయ్య: మాంచి దూరదృష్టి గల అమ్మాయిని చూడమని నువ్వే చెప్పావు కదయ్యా...
.... ........ ...
ఓ వ్యక్తి రాత్రి డ్యూటీ కూడా చేస్తున్నాడు. అతనికి పని మీద అంత మక్కువ ఎందుకు పుట్టిందా అనే సందేహం కలిగింది పై అధికారికి. దాంతో ఓ రోజు అతనితో సంభాషణ ఇలా సాగింది.
అధికారి: అర్థరాత్రి దాకా పనిచేస్తున్నావేమిటయ్యా..
ఉద్యోగి: మా ఆవిడ పుట్టింటి నుంచి వచ్చింది, సార్....












Click it and Unblock the Notifications