హజారే పేరు చెప్పి అదరగొట్టిన పిడుగు
తండ్రి తన ఐదేళ్ల కుమారుడికి సీటు కోసం పాఠశాలకు వచ్చాడు.
ఎంతగా వెయిట్ చేసినా హెడ్ మాస్టర్ నుంచి పిలుపు రావడం లేదు.
దాంతో - పది వేల రూపాయలు డొనేషన్ ఇస్తానని చెప్పాగా, సీటు ఇవ్వడం లేదా అని తండ్రి హెడ్ మాస్టర్ పిఎను అడిగాడు.
మీ వాడు జై అన్నా హజారే అని నినాదాలు చేశాడండి, దాంతో హెడ్ మాస్టర్ పారిపోయారండి అని వివరించాడు పిఎ తాపీగా.
.... .....
ఓ మహిళ హత్య కేసులో న్యాయవాది నిందితుడిని క్రాస్ ఎగ్జామినేషన్ చేస్తున్నాడు.
నువ్వు ఆమెను చంపావా అడిగాడు లాయర్
లేదండి అని చెప్పాడు నిందితుడు
నువ్వు ఆమెను చంపిన రోజు గానీ, మర్నాడు గానీ సినిమాకు వెళ్లావా అని అడిగాడు లాయర్
చంపిన రోజు వెళ్లలేదండీ అని జవాబిచ్చాడు నిందితుడు












Click it and Unblock the Notifications