బెల్లు కొట్టి పారిపోవాలట..
చిన్న పిల్లాడు దర్వాజ ముందు నిలబడి ఒక్కటే పనిగా కాలింగ్ బెల్లు వైపు చూస్తున్నాడు. అది అతనికి అందే పరిస్థితి లేదు. ఇంతలో ఓ నడివయస్సు వ్యక్తి అతన్ని చూశాడు.
నడి వయస్సు వ్యక్తి: బాబూ... ఏం కావాలి..
పిల్లాడు: కాలింగ్ బెల్లు నొక్కాలి.
నడి వయస్సు వ్యక్తి (కాలింగ్ బెల్లు నొక్కి): బెల్లు మోగుతోంది. ఇంకా ఏం కావాలి
పిల్లాడు: ఇక్కడి నుంచి పారిపోవాల్సిందే.
....... ........... ....
కుమారుడు: అమ్మా... నా మిత్రుడు ఇంటికి వస్తున్నాడు. ఆట వస్తువులన్నీ దాచేయి..
తల్లి: అతను ఎత్తుకుపోతాడా...
కుమారుడు: ఏం లేదమ్మా... తన వస్తువులను అతను గుర్తు పడుతాడు..












Click it and Unblock the Notifications