చిరంజీవి పెడితే, విజయశాంతి అయినా..
"ఏం వదినా...! అమ్మాయికి ప్రేమించినవాడితోనే పెళ్లి చేస్తున్నారు కదా..?" అడిగింది సూర్యకాంతం పక్కనే ఉన్న అండాళమ్మను గుసగుసగా..
"అవును.. అనుమానం ఎందుకు వచ్చింది...?" అడిగింది అండాళమ్మ.
"పెళ్లి పీటల మీద అమ్మాయి అలిగి కూర్చుంటేనూ..." అంది సూర్యకాంతం.
"పెళ్లి కార్డులో పెళ్లి కుమారుడి పేరు ముందు చిరంజీవి అని చేర్చారట.. తన పేరు ముందు కనీసం విజయశాంతి అని అయినా చేర్చలేదని.." చెప్పింది అండాళమ్మ.
...... .... ........
"మీ ఆయన రెండో పెళ్లి చేసుకుంటానంటే సిగ్గు, శరం లేకుండా అంగీకరించడమేనా.." తల్లి దండకం ఎత్తుకుంది కూతురు సునీత మీద..
"ఏం చేయనమ్మా.. మా అత్తతో పోట్లాడడానికి నేను ఒక్కదాన్ని సరిపోవడం లేదు..." చెప్పింది సునీత.












Click it and Unblock the Notifications