సైకిల్ చైన్ నుంచి సైకిల్...
టీచర్: గోల్డ్ చైన్‌ను కరిగిస్తే ఏమొస్తుంది?
విద్యార్థులు: గోల్డ్ సార్..
టీచర్: వెండి చైన్‌ను కరిగిస్తే ఏమొస్తుంది?
విద్యార్థులు: వెండి
టీచర్: సైకిల్ చైన్‌ను కరిగిస్తే...?
విద్యార్థులు: సైకిల్
టీచర్: !!!!! ????
..... .....
ఓ వీధిలోని ప్రముఖులంతా కలిసి క్రికెట్ ఆడుతున్నారు.
ఓ డాక్టర్ బౌలింగ్ చేస్తుండగా ఓ వ్యక్తి చూడడానికి వచ్చాడు.
"డాక్టర్ గారు ఎలా ఆడుతున్నారు?" అని అడిగాడు ఆ వ్యక్తి మరొకతన్ని
"బ్రహ్మాండంగా అడుతున్నారు. ఇప్పటికిప్పుడు ఆయనకు మూడు వికెట్లు పడ్డాయి, ఆరుగురు పేషంట్లు దొరికారు" చెప్పాడతను.












Click it and Unblock the Notifications