గొడవ పెట్టుకుంటే భార్యాభర్తలట..
సోము ఓ రోజు సుబ్బారావు దుకాణానికి వెళ్లాడు. దుకాణానికి కస్టమర్లు చాలా మంది వచ్చారు. వారిని చూస్తూ ఉండిపోయాడు. వారంతా వెళ్లిపోయిన తర్వాత సుబ్బారావుతో సోము సంభాషణ ఇలా జరిగింది.
సోము: దుకాణానికి వచ్చిన వాళ్లలో ప్రేమికుల జంట ఏదో, భార్యాభర్తల జంట ఏదో గుర్తు పట్టవచ్చా..?
సుబ్బారావు: చాలా సులభం
సోము: మౌనంగా ఏమీ మాట్లాడకుండా సరుకులు తీసుకునేవాళ్లు ప్రేమికులు.. సరుకులు కొనేటప్పుడు వాదనకు దిగేవాళ్లు భార్యాభర్తలు.
.......... ....... .........
పాఠశాలకు కొత్త టీచర్ వచ్చింది. తాను పాఠం చెప్పాల్సిన తరగతి గదికి వచ్చి విద్యార్థినీ విద్యార్థులను పరిచయం చేసుకుంటూ ఉంది. వరుసగా అలా వస్తూ రాము దగ్గరికి వచ్చి - "నీ పేరేమిటి" అని అడిగింది.
"రాము" అని చెప్పాడు.
"నువ్వు ఎక్కడ పుట్టావు?" అడిగింది టీచర్
"సికింద్రాబాద్" చెప్పాడు రాము
"ఇంగ్లీషులో సికింద్రాబాద్ స్పెల్లింగ్ చెప్పగలవా?" అని అడిగింది.
"ఏమో టీచర్... నేను మెదక్‌లో పుట్టిననట్లు అనిపిస్తోంది" అన్నాడు రాము












Click it and Unblock the Notifications