ప్చ్... మరో గంట బతకాల్సినవాడు..
నర్సు హడావిడగా పరుగెత్తుకుంటూ రావడం చూసి ఏమైందని అడిగాడు డాక్టర్.
''ఆరో నెంబర్ గదిలోని పేషంట్ కిటికీలోంచి దూకి ఆత్మహత్య చేసుకున్నాడు, డాక్టర్" అని చెప్పింది నర్సు
" మరో గంట బతకాల్సినవాడు.. అప్పుడే పోయాడా... ఏం చేస్తాం" అన్నాడు డాక్టర్ తాపీగా...
.... ..... .....
ఇద్దరు మిత్రులు చాలా కాలం తర్వాత కలిశారు.
"ఎక్కడుంటున్నావు" అని అడిగాడు రాము సూరిని
చెప్పాడు సూరి.
"ఏం చేస్తున్నావు" అని అడిగాడు రాము
"నీతో మాట్లాడుతున్నాను, కదా.. కనిపించడం లేదా" అన్నాడు సూరి చిరాగ్గా.












Click it and Unblock the Notifications