కాళ్ల మీదే నిలబడ్డా....

తన కుమారుడి అల్లరి చిల్లర పనులతో, ఏవి పట్టించుకోని తత్వంతో సుబ్బారావు విసిగిపోయాడు. కొడుక్కి బాధ్యత గుర్తు చేయాల్సిందేనని ఓ రోజు నిశ్చయించుకున్నాడు. ఇద్దరు కలిసి భోంచేస్తున్నారు.

ఇదే తగిన సమయమని నిర్ణయించుకున్న సుబ్బారావు ఉపోద్ఘాతం ప్రారంభించాడు - కొంత వయస్సు వచ్చిన తర్వాత నీ కాళ్ల మీద నువ్వు నిలబడడానికి ప్రయత్నించాలి అన్నాడు.

ఏ మాత్రం జంకకుండా - నా కాళ్ల మీద నేనే నిలబడ్డాను, డాడీ అని జవాబు ఇచ్చాడు పుత్రరత్నం.

దాంతో కోపం నషాళానికి ఎక్కిన సుబ్బారావు - నువ్వు నిలబడలేదు, కూర్చుని మెక్కుతున్నావు అన్నాడు.

.... ....

వరహాల రావు ఇంటికి బంధువు వచ్చాడు. బంధువును సాదరంగా ఆహ్వానించాడు వరహాలరావు.

కాసేపు యోగక్షేమాలు మాట్లాడుకున్న తర్వాత - సమయం చాలా అయింది, భోజనం చేద్దాం, రండి అన్నాడు వరహాలరావు.

ఆకలిగా ఉంది, మీ మాటతో నా కడుపు నిండింది అన్నాడు బంధువు

కడుపు నిండితే తినడమెందుకు అలా కాస్తా కునుకు తీయండి అన్నాడు వరహాలరావు.

ఆ మాటతో వచ్చిన బంధువు నివ్వెరపోయాడు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+