ఆ టీచర్‌కు లెక్కలు రావేమో...
"మా లెక్కల టీచర్ వరస నాకేం అర్దం కావటం లేదు మమ్మీ ..." కంప్లైంట్ చేసింది చిన్నారి స్కూల్ నుంచి రాగానే ...
"ఏమైందిరా? చిన్నూ!" అంది ఆ మమ్మి
"లేకపోతే ఏమిటి...నిన్నేమో నాలుగు +ఒకటి=అయిదు అని చెప్పిందా...ఇవాళేమో మూడు+రెండు=అయిదు అంటోంది
అసలు ఆవిడకే సరిగ్గా లెక్కలు రావేమో అని నా డౌట్" అంది
------------
ఓ పీనాసి సుబ్బారావు కొత్తగా రిలీజైన ఓ సస్పెన్స్ సినిమా చూడటానికి వెళ్లారు. అక్కడ టిక్కెట్టు క్యూలో చాలా రష్ గా ఉంది.
దాంతో ఓ కుర్రాడిని పిలిచి క్యూలో నిలబడి ఓ టిక్కెట్టు తెచ్చిపెట్టమని అడిగాడు. ఆ కుర్రాడు ఓ పది రూపాయిలు సంపాదించుకోవచ్చు కదా అని ఆశపడి ఓ గంటసేపు క్యూలో నిలబడి టిక్కెట్టు సంపాదించాడు.
సుబ్బారావు గారు ఆ కుర్రాడి చేతిలో ఒక్క రూపాయ పెట్టి ధాంక్స్ చెప్పి హాల్లోకి వెళ్లబోయాడు..
మండిపోయిన ఆ కుర్రాడు....వెంటనే ఆయన వెనక పరుగెత్తి... "సార్...ఈ సినిమాలో సీరియల్ కిల్లర్ మరెవరో కాదు...ఇంట్లో పనిచేసే నౌఖరే" అని ట్విస్ట్ రివీల్ చేసి పారిపోయాడు.












Click it and Unblock the Notifications