తాళం తీస్తాడట, డోర్స్ పట్టుకోవాలట..
ఓ రోజు సుబ్బారావు బాగా తాగి వచ్చాడు. తూలుతూ తూలుతూ ఇంటికి చేరుకున్నాడు.
జేబులోంచి తాళం చెవులు తీసి తాళం తీయడానికి ప్రయత్నిస్తున్నాడు. తాళం చెవి అటూ ఇటూ జారుతుండడం వల్ల తాళం తీయడానికి వీలు కావడం లేదు.
పరిస్థితిని గమనించిన పక్కింటి వ్యక్తి వచ్చి - "తాళం చెవి ఇవ్వు, నేను తీస్తాను" అని చెప్పాడు.
దానికి సుబ్బారావు ప్రతిస్పందిస్తూ - "తాళం నేనే తీస్తా, కదలకుండా నువ్వు తలుపులను పట్టుకో" అని అన్నాడు.
....... ........ ......
అతనికి గర్ల్ ఫ్రెండ్ నుంచి ఫోన్ వచ్చింది..
"నేను రేపు నిన్ను కలవడం లేదు" అని చెప్పింది ఆమె.
"ఏం, ఎందుకు?" అని అడిగాడు అతను
"నాకు చాలా అత్యవసరమైన పని" ఉంది చెప్పిందామె.
"సరే మరి, రేపు నీకు ఇవ్వాలని తెచ్చిన గిఫ్ట్ ఎవరైనా ఇస్తా" చెప్పాడతను
"రేపు రానని చెప్పాను గానీ ఈ రోజు రానని చెప్పలేదు కదా.. వెంటనే వచ్చేస్తున్నా" అని చెప్పింది ఆమె.












Click it and Unblock the Notifications