తిట్లను చిరునవ్వుతో భరించాడు..
భర్త: నేను నిన్న పక్కింటికి వెళ్లా. నాకే ఆశ్చర్యం వేసింది. సుబ్బారావును వాళ్లావిడ తిట్టిన తిట్టు తిట్టంకుడా తిట్టింది. అయినా అతను ఏమీ మాట్లాడకుండా చిరునవ్వుతో భరించాడు. ఎంత ఓపిక మనిషో..
భార్య: మీ మొహం... ఆయనకు చెవుడు.. ఏం మాట్లాడినా వినపడదు..
...... ......... ....
"బిక్షం కోరుతూ మాదా కబళం తల్లీ!" అంటూ అరిచాడతను
"చేయి ఖాళీగా లేదు, వెళ్లు..." అంది ఆవిడ.
"ఖాళీ లేకపోవడం ఏమిటి, తల్లీ... టీవీ చూస్తూ కూర్చున్నారు కదా.." అన్నాడతను.
"ఖాళీ లేదంటే.. బిక్షం వేయడం కుదరదని చెప్పడం... ఆ మాత్రం తెలీదా.." అని కసురుకుంది ఆవిడ.












Click it and Unblock the Notifications