ఎందుకు గుర్తు లేదూ...
భార్య: నా కంటే ఆ క్రికెట్ ఆంటే మీకు ఎక్కువైపోయింది...అసలు మనకు పెళ్లైందన్న విషయం అయినా మీకు గుర్తుందా? (ముక్కు చీదుతూ అరిచేసింది)
భర్త: భలేదానివే ఎందుకు గుర్తు లేదు...ఆ రోజే కదా మొదటి సారిగా మేం క్రికెట్ మ్యాచ్ ఓడిపోయింది
ఆయన క్రికెట్ పిచ్చికి ఆ భార్య ఏమనాలో తెలియక అలా చూస్తూండిపోయింది
-------------
ఒకావిడ..తన వెనక పడుతున్న కుర్రాడితో ఓ రోజు సీరియస్ గా ఇలా చెప్పింది
"నేను మీ తల్లిని కాబోతున్నాను"
దానికి ఆ కుర్రాడు కంగారుపడిపోయాడు.. "ఎప్పుడూ తను కన్నెత్తి చూడలేదే" అని వాపోయాడు...
దానికి ఆమె ఇలా రిప్లై ఇచ్చింది...
"నన్ను అపార్డం చేసుకున్నారు మీరు...నేను తల్లిని కాబోతున్నాను అని నీతో అన్న మాట నిజమే...కానీ నా ఉద్దేశ్యం నీకు తల్లిని కాబోతున్నాను అని...ఎందుకంటే నేను...మీ నాన్న పెళ్లి చేసుకోబోతున్నాం.."












Click it and Unblock the Notifications