ఏ పదితో ఏవి తేవాలో...
భార్య రెండు పది రూపాయల నోట్లు ఇచ్చి ఓ పది రూపాయలతో వంకాయలు, మరో పది రూపాయలతో దోసకాయలు తీసుకురమ్మని సుబ్బారావుకు చెప్పింది.
హుషారుగా బయటకు సంచీతో పాటు వెళ్లిపోయిన సుబ్బారావు కొద్దిసేపటికే ఖాళీ సంచీతో తిరిగి వచ్చాడు.
ఖాళీ సంచిని చూసిన భార్య ఆగ్రహంతో - "చేతులు ఊపుకుంటూ వచ్చావు, కూరగాయలు ఏవి?" అని అడిగింది
"ఏ పది రూపాయలతో వంకాయలు తేవాలో, ఏ పది రూపాయలతో దోసకాయలు తేవాలో చెప్పకుండా నన్ను అంటావేమిటి?" అని కసురుకున్నాడు సుబ్బారావు
.... .......
ఉప్పల్ స్టేడియంలో క్రికెట్ మ్యాచ్ జరుగుతోంది.
గ్యాలరీలో కూర్చున్న ఓ పెద్దాయన ఒంటరిగా కూర్చుని క్రికెట్ మ్యాచు చూస్తున్న తొమ్మిదేళ్ల బాలునే గమనిస్తున్నాడు. తల్లిదండ్రులు గానీ, పెద్దవాళ్లు గానీ లేకుండా ఒక్కడే మ్యాచ్ చూడడానికి ఎలా వచ్చాడా అని ఆలోచించి సందేహం తీర్చుకోవాలని అనుకున్నాడు.
"ఏం బాబూ! టికెట్ చాలా ఖరీదు కదా, ఎవరు కొన్నారు?" అని అడిగాడు పెద్దాయన
"మా డాడీ" అని చెప్పాడు బాలు
"మరి మీ డాడీ ఏడి?" అని అడిగాడాయన
"ఈ టికెట్ కోసం ఇంట్లో వెతుకున్నారు" చెప్పాడు బాలు తాపీగా.












Click it and Unblock the Notifications