నీళ్లలాగే ఖర్చు అంటే ఇలానా...
ఓ పెద్ద కోటీశ్వరుడు కొడుకుకి...స్కూల్లో ''బీద కుటుంబం'' అనే విషయం మీద వ్యాసం రాయమన్నారు.
ఆ కుర్రాడు ఇలా మొదలు పెట్టాడు.
''అనగనగా.....ఒక పేద కుటుంబం. ఆ కుటుంబంలో తండ్రి చాలా పేదవాడు. తల్లి కూడా ఎంతో పేదది, పిల్లలు కూడా అంతే..... వాళ్ళ కారు డ్రైవరు...వాళ్ళ తోట మాలి, వంటమనిషి పాపం అంతా పేదవారే. చివరకు వాళ్ళ ఇంట్లో పనిచేసే నౌఖరు కూడా పేదవాడే. ఒక రోజున వాళ్ళు పాపం.... తినడానికి తిండిలేక కారులో బయలుదేరారు.....''
-------------------------
భార్య,భర్తల మధ్య సంభాషణ
భార్య : చీర కొనుక్కుంటాను.. వెయ్యి రూపాయలిమ్మంటే ఇవ్వరేం
భర్త : కాస్త పొదుపుగా ఉండటం నేర్చుకో...
భార్య : మరి పెళ్లికి ముందు డబ్బుని నీళ్లలా ఖర్చుపెడతానని బిల్డప్ లు ఇచ్చారు
భర్త : అవును..డబ్బుని నీళ్లు లాగే ఖర్చు పెడతాను..అయితే నేను నీళ్లని కూడా చాలా పొదుపుగా వాడతాను. నువ్వే నన్ను సరిగ్గా అర్దం చేసుకోలేదు
------------------------
తన పేషంటుకు ఫోన్ చేసాడు డాక్టర్...
డాక్టర్ : ఏమయ్యా.. ఇదేమైనా పద్దతిగా ఉందా..
పేషంట్ : విషయమేంటో చెప్పండి డాక్టర్ గారూ..
డాక్టర్ : ఫీజుగా నువ్విచ్చిన చెక్ బౌన్స్ అయ్యి తిరిగి వచ్చింది.. తెలుసా..
పేషంట్ : మరి క్రితంసారి మీరు నయం చేసిన రోగం నాకు మళ్లీ తిరిగి వచ్చింది.. తెలుసా..
డాక్టర్ : ఆ ??!












Click it and Unblock the Notifications