అతను అనుభవించాల్సిందేనట..
భార్యాభర్తలు తీవ్రంగా గొడవ పడ్డారు. దీంతో భార్య తన తల్లికి ఫోన్ చేసింది.
"అమ్మా...! నేను ఇక ఇతనితో కాపురం చేయలేను.. ఇంటికి వచ్చేస్తున్నా" అని చెప్పింది.
తల్లి దానికి అంగీకరించకుండా.. "వద్దు, బిడ్డా... నిన్ను చేసుకున్న పాపానికి అతను అనుభవించాల్సిందే.. నేనే అక్కడికి వస్తానుండు" అని చెప్పింది.
......... .......... .......
"నువ్వు చాలా చదువుతావు" అని చెప్పాడు జ్యోతిష్కుడు ఓ యువకుడికి
"చదువుతూనే ఉన్నాను.. ఒకే క్లాసు నాలుగేళ్లుగా చదువుతున్నా.... అసలు నేను పాసవుతానా, లేదా చెప్పు.. సొల్లు కబుర్లు చెప్పొద్దు" అన్నాడు యువకుడు.












Click it and Unblock the Notifications