ఆమెకు అతను ఇచ్చిన సలహా ఏమిటి?
రిలీజ్ సినిమాకు రెండు రోజులు ప్రిపేరై వెళ్లిన ప్రెండ్ ..వెళ్లిన కాస్సేపటికే వెనక్కి వచ్చేసాడు...
దాంతో... "అదేంట్రా సినిమాకి వెళ్లిన వాడివి చూడకుండా వెనక్కొచ్చావ్?" అడిగాడు.
"థియేటర్ బయట 108 వాహనం ఆగి ఉంది. రిస్క్ ఎందుకని వెనక్కొచ్చేసా" అన్నాడు ..కాస్త ముందు జాగ్రత్తగా ఉండే ఆ ప్రెండ్
--------------
భార్యాభర్త స్కూటర్ మీద పోతుంటే ఏక్సిడెంట్ అయ్యింది.
భర్తకు బాగా దెబ్బలు తగిలి ప్రాణాపాయ స్థితిలో హాస్పిటల్లోఉన్నాడు. భార్యకు దెబ్బలు తగలక అతని మంచం పక్కనే ఉంది. ఆమెతో...అతని చివరి మాటలు -
భర్త: రాణీ నా చివరి కోరిక చెల్లిస్తావా.
భార్య: అదేంటండీ మీకేం కాదు ఊరుకోండి.
భర్త: చెల్లిస్తానని చెప్పురాణీ.
భార్య: సరే చెప్పండి.
భర్త: నేను చనిపోతే నా స్నేహితుడు రాముని నీవు పెళ్ళి చేసుకోవాలి.
భార్య: అదేం మాటలండీ.
భర్త: ఫర్వాలేదులే చెప్పు.
భార్య: ఎందుకండీ మీ స్నేహితుడు రాము పైన ఇంత ప్రేమ.
భర్త: ప్రేమ కాదే కసి. నిన్ను పెండ్లి చేసుకోమని సలహా ఇచ్చింది వాడే. వాడికి కూడా ఇంతకింత కావాలని.












Click it and Unblock the Notifications