నా దాంట్లో నీ కంప్యూటరేమిటి...
రాముకు పెద్ద సందేహం వచ్చింది. ఆ సందేహం తీర్చుకోవడానికి గత రాత్రి తాను మద్యం సేవించిన బార్‌కు వచ్చి, బిల్లు కలెక్టర్ వద్దకు వెళ్లాడు.
"నిన్న రాత్రి నేను ఇక్కడికి వచ్చాను కదా.." అని అడిగాడు రాము.
"వచ్చారు, సార్.." అని చెప్పాడు.
"బాగా తాగి చాలా బిల్లు చేసినట్లున్నాను" అని అన్నాడు రాము.
"అవును, సార్.. ఆరు వేల రూపాయల బిల్లు చేశారు. పే చేశారు కూడా.." చెప్పాడతను
"నేను ఆ డబ్బును వృధా చేశానని ఇప్పటి వరకు బాధపడుతున్నాను" అన్నాడు రాము.
.......... ......... .......
ఓ హెల్ప్ డెస్క్ వ్యక్తి ఓ అమ్మాయితో మాట్లాడుతున్నాడు.
హెల్ప్ డెస్క్: మై కంప్యూటర్ మీద డబుల్ క్లిక్ చేయండి.
అమ్మాయి: నీ కంప్యూటర్ నాకు కనిపించడం లేదు.
హెల్ప్ డెస్క్: అది కాదు.. మీ కంప్యూటర్‌లో మై కంప్యూటర్ మీద క్లిక్ చేయండి.
అమ్మాయి: మతిపోయిందా... నా కంప్యూటర్ నుంచి నీ కంప్యూటర్‌లో ఎలా క్లిక్ చేస్తాను...
హెల్ప్ డెస్క్: మీ కంప్యూటర్‌లో మై కంప్యూటర్ ఐకాన్ ఉంటుంది. దాన్ని క్లిక్ చేయండి.
అమ్మాయి: పిచ్చి పట్టేట్లుంది. నా కంప్యూటర్‌లో మీ కంప్యూటర్ ఎలా ఉంటుంది.












Click it and Unblock the Notifications