ఆమెకు ముద్దును తిరిగి ఇచ్చేస్తే...
తింగరి, అతని ప్రెండ్ కలిసి ఓ పబ్ కి వెళ్లారు. తమ వెంట తీసుకు వచ్చిన సాండ్ విచెస్ లను తినడం ప్రారంభించారు. మీ సొంత స్వాండ్ విచ్ లను ఇక్కడ తినటానికి పర్మిషన్ లేదని పబ్ ఓనర్ సున్నితంగా చెప్పారు.
వెంటనే ఇద్దరూ ఒకరిదొకరు మార్చుకుని తినడం ప్రారంభించారు.
------------
సైన్స్ ప్రొఫసర్: ముద్దు పెట్టుకోవటం ఆరోగ్యానికి మంచిది కాదు. ఒక అబ్బాయి అమ్మాయిని ముద్దు పెట్టుకునేటప్పుడు సుమారు 4000 క్రిములు ఆమె శరీరంలోకి చేరుతాయి.
స్టూడెంట్: ఆ అమ్మాయి ఓ ముద్దును తిరిగి ఇచ్చేస్తే సరిపోలా?
సైన్స్ ప్రొఫసర్...షాక్ అయ్యారు.
------------
అప్పారావు: నా భార్యను తలుచుకుంటేనే భయమేస్తోంది.
సుబ్బారావు: ఎందుకు ఆరోగ్యమేమైనా సరిగ్గా లేదా?
అప్పారావు: అలాంటిదేమీ లేదు. కోవై సరళ బ్రహ్మానందం చితక బాదే సీన్ ను గత రెండు రోజులుగా వీడియోలో మళ్లీ మళ్లీ వేసుకుని చూస్తోంది.












Click it and Unblock the Notifications