అమ్మాయే వెతుక్కుంది...
"సార్! మీ శ్రీమతిగారి నుంచి ఫోన్ వచ్చింది, ఇమ్మంటారా?" అని అడిగింది కొత్తగా చేరిన సెక్రటరీ తన బాస్‌ను.
"మూడు నిమిషాల తర్వాత ఇవ్వు" చెప్పాడు అతను.
ఆమె ఆశ్చర్యపోయి - "ఎందుకు, సార్?" అని అడిగింది.
"ఓ మూడు నిమిషాల పాటు తిట్టిన తర్వాత గానీ ఆమె అసలు విషయంలోకి రాదు" చెప్పాడు బాస్ కూల్‌గా.
...... ....... .....
"లక్షలకు లక్షలు కట్నం పోస్తే గానీ అమ్మాయిలకు సంబంధాలు దొరకడం లేదు, వదినా.. మీ అమ్మాయికి అన్నయ్యగారు మంచి సంబంధం తెచ్చారు, గొప్ప విషయమే" అన్నది స్నేహితురాలు మల్లమ్మ తన పక్కింటావిడ రమణమ్మతో..
మూతి మూడు వంకర్లు తిప్పుతూ... "చాల్లే సంబంబడం.. ఆయనకు అన్ని తెలివితేటలు... మా అమ్మాయే వెతుక్కుంది" చెప్పింది రమణమ్మ.












Click it and Unblock the Notifications