ఇక్కడ అత్యంత ఖరీదైందేమిటి...
నరమాంస భక్షకుల రెస్టారెంట్ కి జర్నలిస్ట్ వెళ్ళాడు..
'ఇక్కడ అత్యంత ఖరీదైన వంటకం ఏమిటి?' అడిగాడు జర్నలిస్టు
'రాజకీయ నాయకుల గుండెతో చేసిన కూర'
'ఎందుకని?'
'ఎంతో మంది రాజకీయ నాయకులను కోస్తే గానీ ఓ గుండె లభ్యం కాదు కాబట్టి' చెప్పాడు ఆ హోటల్ నడిపే వాడు
---------------
ఓ అడవిలో ఫ్యాక్టరీ కట్టాలకున్న వాళ్లు...అక్కడ చెట్టులు కొట్టడానికి ప్రకటన ఇచ్చారు.
రివటలా ఉన్న వ్యక్తి ఇంటర్వూకి వచ్చాడు.
అతనివంక డౌట్ గా చూస్తూ దాని ఓనర్... "ఇది వరకు ఎక్కడ పనిచేసేవాడివి?" అన్నారు
'సహారా అడవిలో' అన్నాడతను
'సహారా అడవా?...సహారా ఎడారి కానీ అది అడవి కాదు కదా!!?'
'అది ఇప్పుడు ..కానీ నేను చెట్లు కొట్టకముందు దాన్ని సహారా ఎడారి అని పిలిచే వాళ్ళు' అని చెప్పాడతను కూల్ గా












Click it and Unblock the Notifications