వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
తానైతే తినేస్తాడట....
టీచర్ క్లాసులో గురుత్వాకర్షణ సిద్దాంతం గురించి చెప్తున్నాడు.
టీచర్: న్యూటన్ చెట్టు క్రింద నిలబడ్డప్పుడు... ఆపిల్ కింద పడగానే... కిందకు ఎందుకు పడిందని ఆలోచించాడు. మరి మీరైతే ఏం చేస్తారు
ఓ స్టూడెంట్: పడిన దాన్ని వెంటనే తినేసి రెండోది ఎప్పుడు పడుతుందా ...అని ఆలోచిస్తాను సార్.
----------
"అతనేంటి టైమ్ అడిగితే రెండు గుద్దులు గుద్ది వెళ్ళిపోతున్నాడు?"
"ఓహ్...అతనా...సోమవారం రోజున ఆయన మౌన వత్రం లేండీ! మాట్లాడడు! టైమ్ రెండు అయ్యింది అని చెప్పాడు"
వెంటనే టైమ్ అడిగినవాడు.... "నా అదృష్టం బాగుంది...ఏ పన్నెండు గంటలుకో టైమ్ అడగలేదు.." అన్నాడు వీపు తడుముకుంటూ..