ఎక్కేది, దిగేది ప్లాట్‌ఫారమ్‌పైనే...
హైదరాబాదు నుంచి బెంగళూర్ వెళ్లే రైల్లో ఎక్కి కూర్చున్నాడు సుబ్బారావు. టికెట్ కలెక్టర్ వచ్చి అందరి టికెట్లు చూస్తున్నాడు.
సుబ్బారావు వద్దకు వచ్చి "మీ టికెట్ ఏది?" అని అడిగాడు
జేబులోంచి టికెట్ తీసి చూపించాడు.
"ఇది ప్లాట్‌ఫాం టికెట్. ఇది కాదు. బెంగళూర్ వెళ్లడానికి తీసుకున్న టికెట్ ఏది?" అని అన్నాడు
"నేను ఇక్కడ ప్లాట్‌ఫామ్ నుంచే ఎక్కాను, బెంగళూర్‌లో ప్లాట్‌ఫామ్‌పైనే దిగుతాను" చెప్పాడు సుబ్బారావు
.... .......
"ఏడాదికి 365 రోజులు అయితే, అందులో రాత్రులెన్ని?" అడిగింది టీచర్
"పది టీచర్!" టక్కుమని చెప్పాడు విద్యార్థి బాలు
"అదెలా?" అడిగింది టీచర్
"ఒక శివరాత్రి, తొమ్మిది నవరాత్రులు.. మొత్తం పది" వివరించాడు బాలు












Click it and Unblock the Notifications