కుక్కను మచ్చిక చేయబోతే..
జర్నలిస్టు: మీరు రాసిన జంతువులను మచ్చిక చేసుకోవడం ఎలా అనే పుస్తకం చదివానండీ.. దానిపై మిమ్మల్ని ఇంటర్వ్యూ చేయడానికి వచ్చాను.
పాపారావు: సరే కానీయండి.. నాకు కాలు బాగా లేదు లేవలేను.. కాస్తా ఆ కుర్చీ తీసుకుని కూర్చోండి.
జర్నలిస్టు: ఏమైందండీ..
పాపారావు: మా పెంపుడు కుక్క కరిచిందండీ. ఆ రోజు నుంచి లేవలేకపోతున్నాను..
......... ........ .........
ఎమ్మెల్యే: ఎవరో చాలా మంది వచ్చినట్టున్నారు.. ఎవరూ..
పర్సనల్ సెక్రటరీ: మీ నియోజకవర్గం ప్రజలండీ..
ఎమ్మెల్యే: ఎందుకు వచ్చారో..
పర్సనల్ సెక్రటరీ: ఓటుకు మీరిచ్చే డబ్బులో కొంత అడ్వాన్సు ఇవ్వమంటున్నారండీ..












Click it and Unblock the Notifications