మూడో వాడే కదా...
"నా ముగ్గురు కొడుకుల్లో ఇద్దరు ఎంబిఎ చేశారు" చెప్పాడు సుబ్బారావు.
"మరి మూడో వాడు...?" అడిగాడు మిత్రుడు సన్యాసి రావు.
"వాడా... హెయిర్ కటింగ్ సెలూన్ నడుపుతున్నాడు" చెప్పాడు సుబ్బారావు.
"అలాంటివాడ్ని ఎలా భరిస్తున్నావ్.. తన్ని తగిలేయకపోయావా?!" అన్నాడు సన్యాసి రావు.
"మిగతా ఇద్దరిని పోషించేది వీడే కదా" అసలు విషయం చెప్పాడు సుబ్బారావు.
...... ..... .....
సినిమా హాల్లోకి వెళ్లబోతూ ఓ వ్యక్తి తన భార్యకు పాన్ కట్టించాడు.
"అదేమిటండి, నా ఒక్కదానికేనా? మీరు కూడా ఓ పాన్ కట్టించుకోండి!" అంది భార్య గోముగా.
"వద్దులే... కిళ్లీ లేకపోయినా నేను నోరు మూసుకుని సినిమా చూడగలను" చెప్పాడు ఆ వ్యక్తి.












Click it and Unblock the Notifications