అతని పేరు సెవెన్ హిల్స్..
క్లాసుకు కొత్త ఇంగ్లీష్ టీచర్ వచ్చింది. వస్తూనే ఆమె విద్యార్థులకు ఓ ఆర్డర్ వేసింది. ఇంగ్లీష్ క్లాసులో ఇంగ్లీషులోనే మాట్లాడాలనేది ఆ ఆర్డర్.. విద్యార్థులను అందరినీ పరిచయం చేసుకోమంటూ అడిగింది.
ఒక విద్యార్థి లేచి - "మై నేమ్ ఈజ్ సెవెన్ హిల్స్" అన్నాడు.
"అదేమిటి..?" అని అడిగింది టీచర్
"ఏం లేదు టీచర్, మీరు ఇంగ్లీషులో మాట్లాడాలని ఆర్డరేశారు కదా... అందువల్ల"
"అంటే...?" అని ఆశ్చర్యంగా అడిగింది టీచర్
"అతని పేరు ఏడు కొండలు టీచర్... ఇంగ్లీషులోకి మార్చి తన పేరు చెప్పాడు" అన్నాడా విద్యార్థి.
..... ..... ....
టీచర్: అరే, రామారావు! మనకు అమెరికా దూరమా, సూర్యుడు దూరమా..?
రామారావు: అమెరికానే దూరమండీ...
టీచర్: ఎలా చెప్పగలుగుతున్నావు..?
రామారావు: సూర్యుడు కనిపిస్తున్నాడు కదండీ... అమెరికా కనిపించడం లేదు.












Click it and Unblock the Notifications