మమ్మీని ఎలా తెచ్చావు...
"వెంకయ్యగారూ... ఈ జబ్బు మీతో రాలేదు. వంశపారంపర్యంగా వచ్చింది. ఆపరేషన్ చేస్తే పోతుంది" చెప్పాడు డాక్టర్.
"అమ్మయ్య... బతికించారు. అయితే ఆ అపరేషనేదో మా తాతయ్యకు చెయ్యండి" చెప్పాడు వెంకయ్య.
..... ..... .....
"పట్టుదల ఉంటే మనిషి సాధించలేనిది లేదోయ్" అన్నాడు నరసింహం.
"అలాగా.... అయితే ఈ గ్లాసులో పాలు కింద పోస్తాను. మీ పట్టుదలతో తిరిగి గ్లాసులో నింపండి చూద్దాం" ఎదురన్నాడు కుర్రాడు.
.... ..... .....
కొడుకు నాన్నతో "నాన్న నువ్వు ఈజిప్ట్ ఎప్పుడు వెళ్లావు?"
"నేను ఈజిప్ట్ ఎప్పుడూ వెళ్ళలేదు. అయినా నీకు ఆ సందేహం ఎందుకు వచ్చింది?" ఆశ్చర్యంగా ప్రశ్నించాడు నాన్న.
"మరి మమ్మీని ఎక్కడ నుంచి తీసుకొచ్చావు?"












Click it and Unblock the Notifications