Husband and wife Jokes: భార్య భర్తల మధ్య నెట్టింట్లో పేలుతున్న జోక్స్ మీకోసం..!
భార్య భర్తల మధ్య అనుబంధం ఎంతో పవిత్రమైనది. దంపతులు కలిసి ఉంటేనే కుటుంబం చక్కగా కట్టబడుతుంది. కలహాలు లేని కాపురం చాలా సాఫీగా సాగుతుంది. ఇద్దరిలో ఎవరికైనా సరే కోపం వస్తే ఒకరు సర్దుకుపోవడమే ఉత్తమమైన విషయం. భార్య భర్తల సంబంధం గురించి ఎంతో గొప్పగా చెప్పాయి పురాణాలు. భర్తను శ్రీరాముడితో పోల్చుతూ భార్యను సీతమ్మతో పోలుస్తూ చాలా చక్కగా వర్ణించడం జరిగింది. ఇక కాలక్రమంలో శ్రీరాముడు సీతమ్మ అనే పదాలకు అర్థం మారిపోయింది.
తమ గొడవలతో కాపురాల్లో చిచ్చు పెట్టుకుంటున్నారు. ఇదంతా పక్కన ఉంచితే భార్య భర్తలపై ఈ మధ్య కాలంలో సోషల్ మీడియాలో జోక్స్ తెగ వైరల్ అవుతున్నాయి. అంతేకాదు ప్రస్తుతం టీవీల్లో టెలికాస్ట్ అయ్యే పలు కార్యక్రమాలు కూడా ఎక్కువగా భార్యలను భర్తలను టార్గెట్ చేసి హాస్యం పండించడంపైనే జరుగుతున్నాయి. అలాంటి కొన్ని జోక్స్ సరదాగా నవ్వుకునేందుకు మీకోసం అందిస్తున్నాం.
1 . భార్య: మన పొరిగింట్లో కొత్తగా దిగిన ఆయన ప్రతిరోజు ఆఫీసుకు వెళ్లే సమయంలో తన భార్యకు ముద్దు ఇచ్చి వెళ్తాడు, అలా నువ్వెందుకు ముద్దు ఇవ్వవు
భర్త: నేనెలా ఆమెకు ముద్దు ఇవ్వగలను, ఆమె ఎవరో కూడా తెలియదే..!
*********
2. భర్త: నాకు విడాకులు కావాలి. గత ఆరునెలలుగా నా భార్య నాతో మాట్లాడటం లేదు
లాయర్: ఒక్కసారి ఆలోచించు.. అలాంటి భార్యలు చాలా అరుదుగా దొరుకుతారు
********************
3. భార్య: డాక్టర్ నా భర్త ఆస్ప్రిన్ మెడిసిన్ పొరపాటున మింగేశాడు.. ఇప్పుడేం చేయాలి..?
డాక్టర్ : అతనికి తలనొప్పి కలిగించే పని ఏదైనా చేయి.. అనవసరంగా టాబ్లెట్‌ను వేస్ట్ చేయడమెందుకు
***************
4. భార్య: నేను నీతో మాట్లాడదలుచుకోలేదు
భర్త: ఓకే
భార్య : కారణం ఏమిటో అడగవా..?
భర్త: అవసరం లేదు..నేను నీ మాటను గౌరవిస్తాను
*********

5. భార్యా భర్తలు ఇద్దరూ ఓ రెస్టారెంటులో కలిసి భోజనం చేసేందుకు వెళ్లారు. ఇద్దరూ కూర్చొని ఉండగా సర్వర్ వచ్చి ఆర్డర్ తీసుకుని భోజనం టేబుల్‌పై ఉంచాడు.
భర్త: భోజనం చాలా బాగుంది. తినడం ప్రారంభిద్దాం
భార్య: ఏమండి తినే ముందు ప్రార్థన చేసే అలవాటు ఉంది కదా... ప్రార్థన చేయండి
భర్త: అది ఇంటి భోజనంకే డియర్ , ఇక్కడ వంటవాడికి ఎలా రుచికరంగా వండాలో బాగా తెలుసు
****************
6. భార్య భర్తతో : భోజనం చేశావా..?
భర్త భార్యతో: భోజనం చేశావా..?
భార్య భర్తతో : ముందు నేనడిగాను కదా..?
భర్త భార్యతో : నేను కూడా అడుగుతున్నాను కదా..?
భార్య : ఏంటి ఏది మాట్లాడితే అది తిరిగి చెబుతున్నావ్..?
భర్త: ఏంటి ఏది మాట్లాడితే అది మాట్లాడుతున్నావ్..?
భార్య : సరే షాపింగ్‌కు వెళ్దాం పదండి
భర్త: నేను భోజనం చేసేశాను
********************
7. కోర్టులో విడాకులు పొందేందుకు భార్యా భర్తలు తమ ముగ్గురు పిల్లలను తీసుకుని వెళ్లారు
జడ్జి: మీకు ముగ్గురు పిల్లలున్నారు కదా ఎలా వారిని పంచుకుంటారు..?
భార్యా భర్తలు చర్చించుకున్నాక: సరే సర్.. ఇంకొకరిని కని వచ్చే ఏడాది విడాకుల కోసం వస్తాం
9 నెలల తర్వాత కవలలు పుట్టడంతో మళ్లీ సమస్య మొదటికొచ్చింది.
*******************
8. గుండెనొప్పితో బాధపడుతున్న భర్త వెంటనే అంబులెన్స్‌కు కాల్ చేయమని భార్యను అడిగాడు. దీనికి భార్య వెంటనే భర్త మొబైల్ ఫోన్ తీసుకుని పాస్‌వర్డ్ ఏంటో చెప్పు అని అడిగింది. దీనికి భర్త... ఫర్వాలేదు.. అంబులెన్స్ అక్కర్లేదు.. నాకు ఆరోగ్యం బాగానే ఉందంటూ తెలివిగా సమాధానం ఇచ్చాడు.
***************
9. భార్య : దొంగ ఇంట్లోకి చొరబడి నేను చేసిన కేకును తింటున్నాడు చూడండి
భర్త: ఇప్పుడు నేనేం చేయాలి..? పోలీసులకు ఫోన్ చేయాలా.. లేక అంబులెన్స్‌కు ఫోన్ చేయాలా..?
*****************












Click it and Unblock the Notifications