లైట్ వేయాలన్న మతిమరుపు భర్త
భార్య వంటింట్లో ఉంది.
భర్త బయట ఆరాం కుర్చీలో కూర్చుని దీర్ఘాలోచనలో మునిగిపోయాడు.
అకస్మాత్తుగా కరెంట్ పోవడంతో లైట్లు ఆరిపోయాయి - ఏమండీ, కాస్తా క్యాండిల్ పట్టుకు రండి అంది భార్య.
కుర్చీలోంచి లేస్తూ - కాస్తా లైట్ వేయవే, ఎక్కడుందో కనిపించడం లేదు అన్నాడు మతిమరుపు భర్త.
.... ..... ...
పాలు పోసే అబ్బాయి ధర పెంచాలండి, అమ్మగారూ అని అడిగాడు.
ఎందుకురా, మొన్ననే కదా పెంచింది అంది ఇంటి యజమాని.
ఎండకాలం వచ్చేసింది అమ్మగారు, నీళ్ల ధర పెరిగిందమ్మా... అన్నాడు పాల అబ్బాయి.
నీళ్లకు, పాలకు సంబంధం ఏమిట్రా అని అడిగింది.
అమ్మా, ఆరోగ్యం దెబ్బ తినకూడదని పాలల్లో డిస్టిల్డ్ వాటర్ మాత్రమే కలుపుతున్నాను అని చెప్పాడు.












Click it and Unblock the Notifications