డజన్ లవర్స్‌ను వదిలేశాడట...
భార్యాభర్తలిద్దరు గొడవ పడుతున్నారు. ఎవరెవరు ఏం త్యాగాలు చేశారో చెప్పుకుంటున్నారు. వారి మధ్య సంభాషణ ఇలా సాగింది.
భార్య: నీ కోసం నా తల్లిదండ్రులనే వదిలేసి వచ్చా.
భర్త: నీ కోసం నేను పది మంది లవర్స్‌ను వదిలేశా.. ఎవరు ఎక్కువ త్యాగం చేశారో గుర్తించాలి..
..... ..... .....
"ఆ రవి గాడు చంపేశాడ్రా, బాబూ... మాట విననందుకు నాకు శిక్ష వేశాడు చెప్పాడు" బాధగా సూరి.
"సినిమాకు తీసుకెళ్లాడు కదరా, అది శిక్ష ఎలా అవుతుంది?" అడిగాడు మిత్రుడు
"ఆ హీరో కుప్పిగంతులు చూడలేక, ముసలి హీరో పడుచు హీరోయిన్‌తో డ్యాన్స్ చేస్తుంటే నాకు వాంతులు తన్నుకొచ్చాయంటే నమ్ము.. వెంటనే ఆస్పత్రిలో చేరాల్సి వచ్చింది. వాడు అడిగిన డబ్బులు ఇచ్చినా పోయేది.. వాడు అడిగిన దానికన్నా ఎక్కువే ఖర్చయ్యాయి" చెప్పాడు సూరి.












Click it and Unblock the Notifications