అతను అలా వెళ్తే ఇలానా...
భర్త: నేను దర్జాగా సూట్, బూట్ వేసుకుని పోతే దుకాణంవాడు కూరగాయల ధరలు ఎక్కువగా చెబుతున్నాడు. సాదాసీదా దుస్తుల్లో వెళ్తే తక్కువ చెబుతున్నాడు.
భార్య: ఓ చిప్ప పట్టుకుని వెళ్లు.. అప్పుడు కూరగాయలు ఫ్రీగా దొరుకుతాయి..
...... ......... ....
సుబ్బారావు పెళ్లి చేసుకోవడానికి అమ్మాయిని చూడడానికి వెళ్లాడు.
అమ్మాయి తండ్రి వారిద్దరు ఏకాంతంగా మాట్లాడుకోవడానికి వీలుగా బయటకు వెళ్లిపోయాడు.
సుబ్బారావు చెమటలు పట్టేశాయి. ఏం మాట్లాడాలో తెలియలేదు. చివరికి గుండెను చిక్కబట్టుకుని .. "సిస్టర్.. నీకు ఎంత మంది అన్నదమ్ములు?" అని అడిగాడు.
అమ్మాయికి కోపం వచ్చింది. "ఇప్పటి వరకు ఇద్దరే ఉన్నారు.. ఇప్పుడు ముగ్గురైపోయారు" అని చెప్పి విసవిసా అక్కడి నుంచి వెళ్లిపోయింది.












Click it and Unblock the Notifications